స్ట్రెయిన్‌ వైరస్‌ కలకలం

ABN , First Publish Date - 2021-03-06T06:02:20+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మరోమారు జిల్లాలో కలకలం రేపుతోంది.

స్ట్రెయిన్‌ వైరస్‌ కలకలం
సూచనలు ఇస్తున్న వైద్యురాలు

 జిల్లాలో ఇద్దరికి న్యూ స్ట్రెయిన్‌గా అనుమనాలు

 బ్రిటన్‌ విమానాల్లో దుబాయి నుంచి రాక

ఒకే ఇంట్లో మరో ఆరుగురికి సైతం...?

కాంటాక్ట్‌ లిస్ట్‌ కోసం అధికారుల ఆరా

జగిత్యాల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మరోమారు జిల్లాలో కలకలం రేపుతోంది. ఇటీవల బ్రిటన్‌ విమానాల్లో దుబాయి నుంచి జగిత్యాల జిల్లాకు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కొత్త స్ట్రెయిన్‌గా అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరి కుటుంబానికి చెందిన ఆరుగురికి సైతం కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ కావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కోరుట్ల మం డలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన ఓ 26 ఏళ్ల వ్యక్తి బ్రిటన్‌ విమా నంలో గత నెల 25వ తేదీన దుబాయి నుంచి స్వస్థలానికి వచ్చాడు. ఇ టీవల కరోనా వైద్య పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్‌గా తేలింది. కా గా సదరు వ్యక్తికి న్యూ స్ట్రెయిన్‌ వైరస్‌ సోకినట్లుగా వైద్యులు అనుమా నిస్తున్నారు. దీంతో హుటాహుటిన అతడిని వైద్యాధికారులు ప్రత్యేక వా హనంలో హైద్రాబాద్‌ తరలించి మరిన్ని పరీక్షలు చేస్తున్నారు. వెంక టాపూర్‌లోని సదరు బాధిత వ్యక్తి కుటుంబానికి చెందిన ఆరుగురికి వై ద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వచ్చే రెండు రోజుల్లో ఫలితా లు వచ్చే అవకాశాలున్నాయి. మల్యాల మండలం ముత్యంపేట గ్రామా నికి చెందిన 35ఏళ్ల వ్యక్తి గత నెల 27వ తేదీన బ్రిటన్‌ విమానంలో దుబాయి నుంచి స్వగ్రామానికి వచ్చాడు. దుబాయిలో వైద్య పరీక్షలు ని ర్వహించుకున్న సమయంలో సదరు వ్యక్తికి నెగెటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. స్వగ్రామానికి వచ్చిన అనంతరం మరోమారు కరోనా పరీక్షలను చేయిం చుకోగా పాజిటివ్‌గా తేలింది. ఆయనకు న్యూస్ట్రెయిన్‌ వైరస్‌ సోకినట్లు గా వైద్యులు అనుమానించి హైద్రాబాద్‌ తరలించి ప్రత్యేక పరీక్షలు చే యిస్తున్నారు. దీంతో పాటు ముత్యంపేటలోని 14 మంది కుటుంబ స భ్యులకు సైతం అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురి కి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షణ జరుపుతున్నారు. తాజా గా ముత్యంపేటలో బాధిత ఆరుగురు కుటుంబ సభ్యులకు కరీంనగర్‌ నుంచి వచ్చిన వైద్య బృందం సభ్యులు ఆర్టీపీ సీఆర్‌ పరీక్షల కోసం శాం పిల్స్‌ సేకరించారు. మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన ఒకరిని, కోరుట్ల మండలంలోని వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన ఒకరిని హైద్రా బాద్‌ తరలించడంతో పాటు అవసరమైన జాగ్రత్తలను అధికారులు తీ సుకుంటున్నారు. గత నెల 25, 27వ తేదీల్లో స్వగ్రామాలకు వచ్చిన సద రు వ్యక్తులు ఎవరెవరిని కలిశారు...ఎవ రెవరికి సోకే అవకాశాలున్నా యి..అన్న అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాధితుల కాంటాక్ట్‌ లిస్ట్‌ను వైద్యులు సేకరిస్తున్నారు. కాంటాక్ట్‌ అయిన వ్యక్తులను అప్రమ త్తం చేస్తున్నారు. ఒకవేళ న్యూ స్ట్రెయిన్‌ వైరస్‌ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించారు.

జిల్లాలో ఇప్పటివరకు 10,702 పాజిటివ్‌ కేసులు....

జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు వైద్యాధికారులు ప్ర త్యేక కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షల్లో 10,702 మందికి కరోనా పాజిటి వ్‌గా నిర్ధారణ అయింది. జిల్లాలో 1,76,817 మందికి కరోనా పరీక్షలు చే యగా 10,802 మందికి పాజిటివ్‌ ఫలితాలు వచ్చాయి. కరోనా సోకిన 56 మంది మృత్యువాత పడ్డారు. జిల్లాలోని 18 మండలాల్లో ప్రస్తుతం 85 మంది హోమ్‌ క్వారంటైన్‌, వైద్యుల పర్యవేక్షణలో ఉండి వైరస్‌తో పో రాడుతున్నారు. జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీన కోరుట్ల పట్టణం లో ఒకరికి, కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తొలి కేసు నమోదైంది. జనవరి 16 నుంచి జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ పంపిణీని ప్రారంభించారు. పలు విడతల్లో ఫ్రం ట్‌లైన్‌ వారియర్స్‌కు, మున్సిపల్‌, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ ఉ ద్యోగులు సిబ్బందికి, ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి, అంగన్‌వాడీలకు వ్యాక్సిన్‌ వేశారు. ప్రస్తుతం 65 ఏళ్లుపైబడిన వ్యక్తుల కు వ్యాక్సిన్‌ వేస్తున్నారు. 45ఏళ్లు పైబడి పలు దీర్ఘకాలిక వ్యాధులున్న వ్యక్తులకు సైతం టీకాలు వేస్తున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచి వ్యాప్తిని నివారించడా నికి చర్యలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో స్ట్రెయిన్‌ వైరస్‌ వ్యాప్తి అనుమానాలు చోటుచేసుకుంటుండడం కలకలం రేపుతోంది. ప్ర జలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటిస్తేనే మేలు అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పుప్పాల శ్రీధర్‌ కోరు తున్నారు.


వెంకటాపూర్‌ గ్రామవాసికి కొత్త స్ర్టెయిన్‌ లక్షణాలు

కోరుట్ల రూరల్‌ : వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన యువకుడు(24) కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాడు. ఫిబ్రవరి 25 తేదీన దుబాయి నుంచియు.కే విమానం ద్వారాహైదరాబాద్‌లోని శంషాబాద్‌ లో దిగాడు. అక్కడ అధికారులు యువకుడికి కరోనా పరీక్షలు నిర్వహిం చగా పాజిటివ్‌ రావడంతో అధికారుల సూచన మేరకు హోంక్వారం టైన్‌లో ఉన్నాడు. అధికారులు సేకరించిన శాంపిల్స్‌ ద్వారా మిగితా పరీ క్షలు నిర్వహించగా యువకుడికి న్యూ స్ట్రెయిన్‌ లక్షణాలను గుర్తించారు. వెంటనే అక్కడి వైద్యాధికారులు జిల్లా ఉన్నత అధికారులకు తెలుపడం తో వారు యువకుడిని గురువారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. యువకుడి కుటుంబ సభ్యుల్లో నలుగురి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపారు. 



ముత్యంపేటలో ఇంటింటా సర్వే

మల్యాల : ముత్యంపేటలో మల్యాల పీహెచ్‌సీ ఆధ్వర్యంలో జగిత్యా ల ఆర్‌బీఎస్‌కే సిబ్బంది గత గురువారం రాపిడ్‌ పరీక్షలు చేసిన 13మం దితో పాటు మరొకరికి పూర్తి స్థాయి నిర్ధారణ కోసం ఆర్‌టీపీసీ ఆర్‌ పరీ క్షలకు గాను శాంపిల్స్‌ తీసుకొని హైదరాబాద్‌ పంపించారు. ఇందులో క రోనా సోకిన వారు ఆరుగురు ఉన్నారు. వాటి ఫలితాలు నేడు రానుండ గా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి వచ్చింది కొత్త స్ట్రెయిన్‌ ఔనా, కాదా అనేది ఇంకా సమాచారం రాలేదని మల్యాల పీహెచ్‌సీ వైద్యురాలు లా వణ్య తెలిపారు. అంతకు ముందు ఇంటింటా సర్వే చేసిన వైద్య సిబ్బం ది లక్షణాలు, అనుమానాలు ఉంటే పరీక్షలు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. 


Updated Date - 2021-03-06T06:02:20+05:30 IST