ఈ జీవి.. చేప నాలుకను మాత్రమే తింటుంది.. అలా తిన్న తర్వాత ఏం చేస్తుందంటే..

ABN , First Publish Date - 2021-10-24T03:03:17+05:30 IST

సృష్టిలో వింత వింత జీవులు ఉంటాయి. మనకు తెలిసినవి కొన్నే.. తెలియనివి ఇంకెన్నో ఉంటాయి. అలాంటివి వెలుగులోకి వచ్చినప్పుడు.. చూసి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అరే ఈ జీవులేంటి మరీ విచిత్రంగా ఉన్నాయి.. అని అనుకుంటూ ఉంటాం.

ఈ జీవి.. చేప నాలుకను మాత్రమే తింటుంది.. అలా తిన్న తర్వాత ఏం చేస్తుందంటే..

సృష్టిలో వింత వింత జీవులు ఉంటాయి. మనకు తెలిసినవి కొన్నే.. తెలియనివి ఇంకెన్నో ఉంటాయి. అలాంటివి వెలుగులోకి వచ్చినప్పుడు.. చూసి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అరే ఈ జీవులేంటి మరీ విచిత్రంగా ఉన్నాయి.. అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే జీవి కూడా అలాంటిదే. ఒక జీవి మీద దాడి చేసే మరో జీవి.. దాన్ని మొత్తం తినేయడం సాధారణమే.. కానీ ఈ పరాన్నజీవి మాత్రం చేప మీద దాడి చేస్తుంది. కానీ దాన్ని మొత్తం తినేయకుండా.. కేవలం నాలుకను మాత్రమే తింటుంది. తర్వాత అది ఏం చేస్తుందో తెలుసుకుందాం.. 


అమెరికాలోని టెక్సాస్ స్టేట్ పార్క్‌‌లో చాలా కాలం క్రితం ఓ పరాన్నజీవి బయటపడింది. గాల్వెస్టన్ ఐలాండ్ స్టేట్ పార్క్‌ అధికారుల తనిఖీల్లో భాగంగా ఈ జీవిని గుర్తించారు. అట్లాంటిక్ క్రోకర్ అనే ఓ జాతి చేప నోట్లో పరిశీలించగా.. నాలుక ఉండాల్సిన స్థానంలో ఓ పరాన్న జీవి ఉండడాన్ని వారు గమనించారు. ఆ చేప నాలుకను మొత్తం అది తినేసింది. తర్వాత నోటిలో నాలుక తరహాలోనే అతుక్కుపోయినట్లు గుర్తించారు. చేప నాలుకగా మారిన ఆ జీవి.. అనంతరం చేప శ్లేష్మాన్ని తింటుందని అధికారులు తెలిపారు. కానీ అది చేపకు ఏమాత్రం హాని చేయదట. అలాగే మనుషులకు కూడా హాని చేయదని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.



Updated Date - 2021-10-24T03:03:17+05:30 IST