అక్కడ వింత నియమం!
ABN , First Publish Date - 2021-01-16T05:34:05+05:30 IST
ప్రకృతి అందాలు కనిపిస్తే వెంటనే ఫోన్‌తో క్లిక్‌మనిపిస్తాం. సెల్ఫీలతో బిజీ అయిపోతాం. ఇక పర్యాటకులైతే కెమెరాలకు పని చెబుతారు
ప్రకృతి అందాలు కనిపిస్తే వెంటనే ఫోన్‌తో క్లిక్‌మనిపిస్తాం. సెల్ఫీలతో బిజీ అయిపోతాం. ఇక పర్యాటకులైతే కెమెరాలకు పని చెబుతారు. అయితే ఈ పట్టణంలో మాత్రం ఫొటోలు తీయలేరు. ఆ నిబంధనే ఆ నగరంలో పర్యాటకులు పెరిగిపోవడానికి దోహదం చేసింది.
- స్విట్జర్లాండ్‌లోని బెర్గున్ అనే పట్టణం కొండల మధ్య, పచ్చని పచ్చిక బయళ్ల నడుమ ఉంటుంది. అక్కడి ప్రకృతి అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.
- ఆ పట్టణం అందాలు ఎవరైనా వ్యక్తిగతంగా వచ్చి చూడాల్సిందే తప్ప, ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో చూడటం అక్కడి ప్రజలకు ఇష్టం లేదు. అందుకే ఫోటోలు తీయడంపై నిషేధం పెట్టారు.
- ఫోటోలు తీయడం నిషేధం అని బోర్డులు సైతం పెట్టారు. ఆ నిబంధన పెట్టాక పర్యాటకుల తాకిడి ఇంకా పెరిగిందట. మౌత్ పబ్లిసిటీ వల్ల పర్యాటకుల సంఖ్య విశేషంగా పెరుగుతోందట.