అర్ధరాత్రి.. లైట్ల వెలుగుపడి రోడ్డు పక్కన కనిపించిందో ఆకారం.. అనుమానంతో బస్సును ఆపి ఆ డ్రైవర్ వెళ్లి చూస్తే..

Published: Wed, 10 Aug 2022 15:59:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అర్ధరాత్రి.. లైట్ల వెలుగుపడి రోడ్డు పక్కన కనిపించిందో ఆకారం.. అనుమానంతో బస్సును ఆపి ఆ డ్రైవర్ వెళ్లి చూస్తే..ప్రతీకాత్మక చిత్రం

ప్రయాణికులతో నిండిన ఓ బస్సు రాత్రి వేల గమ్యస్థానానికి బయలుదేరింది. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో బస్సు వేగంగా దూసుకెళ్తోంది. ఓ మలుపు వద్దకు రాగానే డ్రైవర్ వేగాన్ని కాస్త తగ్గించాడు. బస్సు లైటు వెలుతురులో దూరంగా ఏదో ఆకారం కనిపించింది. దీంతో అనుమానం వచ్చి బస్సును అక్కడే ఆపాడు. బస్సు దిగిన డ్రైవర్.. ఆ ఆకారం వద్దకు వెళ్లి చూసి షాక్ అయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..

అర్ధరాత్రి.. లైట్ల వెలుగుపడి రోడ్డు పక్కన కనిపించిందో ఆకారం.. అనుమానంతో బస్సును ఆపి ఆ డ్రైవర్ వెళ్లి చూస్తే..

హర్యానా (Haryana) రాష్ట్రం రేవారీ జిల్లా పరిధి ఢిల్లీ-జైపూర్ హైవేపై గర్హి ప్రాంత సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో మంగళవారం రాత్రి  ఢిల్లీ-జైపూర్ హైవేలో (Delhi Jaipur Highway) వెళ్తూ ఉంది. గర్హి అలవల్‌పూర్ గ్రామ సమీపానికి వచ్చేసరికి.. సరిగ్గా అర్ధరాత్రి అయింది. గ్రామ సమీపంలోని మలుపు వద్ద బస్సు నిదానంగా వెళ్తోంది. మలుపు తిరిగే సమయంలో బస్సు లైటు వెలుతురులో దూరంగా ఓ ఆకారం కనిపించింది. దీంతో బస్సును ఆపిన డ్రైవర్.. ఆ ఆకారం వద్దకు వెళ్లాడు. సమీపానికి వెళ్లి చూస్తే.. మహిళ మృతదేహం (woman dead body) పడి ఉంది.

extramarital affair: ప్రియుడిని రోజూ కలవాలనే ఉద్దేశంతో.. ఇంట్లో పిల్లలు చూస్తుండగా మహిళ చేసిన నిర్వాకం..

దీంతో డ్రైవర్‌తో పాటూ ప్రయాణికులంతా షాక్ అయ్యారు. మహిళ ముఖంపై గాయాలు ఉండడంతో పాటూ మెడకు చున్నీ కట్టి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుండగులు మహిళ మెడకు చున్నీ బిగించి, హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలి వయస్సు 28 నుంచి 30ఏళ్ల వయసు మధ్య ఉన్నట్లు తెలిపారు. మహిళ ఫొటోను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Atrocity on girlfriend: రాత్రి వేళ ఇంట్లోకి వచ్చిన ప్రియుడు, అతడి స్నేహితుడు.. కాసేపటికి యువతి కాళ్లు, చేతులు కట్టేసి మరీ..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Funny video: పెళ్లి పీటల మీదే ఇలా ఉంటే.. వివాహానంతరం వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో... videoSuspicious Women: ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ.. పోలీసులకు అనుమానం వచ్చి.. ఆమె సూట్‌కేస్‌ను తెరచి చూడగా.. Dubai jobs scam: దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. పాకిస్థాన్‌కు పంపించిన ఏజెంట్.. 20ఏళ్ల తర్వాత వృద్ధురాలి పరిస్థితి ఏంటంటే.. Viral Video: కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లీకొడుకు.. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ గుర్తించడంతో.. videodrunk woman: యువకుడితో పాటూ ఫుల్‌గా మందుకొట్టిన మహిళ.. అదే సమయంలో పిల్లలు వీడియో తీయడంతో.. చివరకు..Marriage funny video: పాపం ఏ పెళ్లికూతురికీ రాని కష్టం వచ్చిందే.. పక్కనున్న వారంతా నవ్వుతుంటే.. చివరకు ఎలాగోలా.. video
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.