రోడ్డుకు ఓ వైపు షాపులు బంద్.. మరో వైపు జనాల రద్దీ.. ఇదే వింత అనుకుంటే మరో విచిత్రం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-01-24T21:27:49+05:30 IST

పై ఫొటోను గమనించారా? ఆ ఫొటోలో ఒకే రోడ్డుపై భిన్న పరిస్థితులు నెలకొన్నాయి.

రోడ్డుకు ఓ వైపు షాపులు బంద్.. మరో వైపు జనాల రద్దీ.. ఇదే వింత అనుకుంటే మరో విచిత్రం ఏంటంటే..

పై ఫొటోను గమనించారా? ఆ ఫొటోలో ఒకే రోడ్డుపై భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుకు ఎడమ వైపు ఉన్న షాపులు మూసేసి ఉన్నాయి. అటువైపు జన సంచారం కూడా లేదు. అదే రోడ్డుకు కుడి వైపు మాత్రం దుకాణాలు తెరిచి ఉన్నాయి. జనాల రద్దీ కనిపిస్తోంది. ఎందుకిలా అని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే.. ఆ రోడ్డు ఎడమ వైపు ప్రాంతం తమిళనాడుకు చెందినది కాగా.. కుడి వైపుది పుదుచ్చేరి రాష్ట్రానికి సంబంధించినది. 


రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. దీంతో ఆ రాష్ట్రంలో ఆదివారం దుకాణాలు తెరవలేదు. అయితే పుదుచ్చేరి ప్రభుత్వం మాత్రం పాక్షిక లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించింది. దీంతో సరిహద్దు ప్రాంతాలైన తమిళనాడులోని విల్లుపురం, పుదుచ్చేరిలోని తిరుక్కానూర్ ప్రాంతాల్లో ఒకే రోడ్డుపై భిన్న పరిస్థితులు కనిపించాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

Updated Date - 2022-01-24T21:27:49+05:30 IST