విజేతలకు బహుమతులు అందిస్తున్న పటేల్ ప్రభాకర్ రెడ్డి
గద్వాల క్రైం/ అర్బన్, జనవరి 24: క్రీడాకారులు పట్టుదలతో శ్రమిస్తే తప్పక విజయం వారినే వరిస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇన్విటేషన్ క్రికెట్ ముగింపు వేడుకలను ఆధివారం ఘనంగా నిర్వహించారు. ఏడు రోజులుగా జరిగిన ఈ టోర్నీలో విన్నర్స్‌గా ఎన్.ఆర్.రైడర్(విజయ్ మెస్), రన్నర్స్‌గా వీరబాబు స్ట్రేకర్స్ నిలిచారు. వీరికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పటేల్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు, ఓటమిలను సమానం స్వీకరించినప్పుడే వారు ఉన్నతంగా రాణిస్తారన్నారు. ఇందులో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఖాయ్యుమ్, బెస్ట్ బోలర్‌గా వంశీ, బెస్ట్ బ్యాస్ట్మెన్గా నిఖిల్‌రెడ్డి బహుమతులు అందుకున్నారు.