అల్లరిమూకల ఆగడాలు

ABN , First Publish Date - 2021-07-25T04:59:34+05:30 IST

అల్లరిమూకల ఆగడాలు

అల్లరిమూకల ఆగడాలు

ఖమ్మంలో కట్టుతప్పుతున్న యువత

సెటిల్‌మెంట్ల పేరుతో కర్రలు, రాడ్లతో రోడ్లపై సంచారం

దందాల్లోకి 20ఏళ్ల వయస్సు వారు..

కూలీ ఇచ్చి మందు పోయిస్తే చాలు చెప్పింది చేస్తారు

పోలీసు, అధికారపార్టీ అండదండలున్నాయంటూ ప్రగల్బాలు

ఖమ్మం, జూలై 24(ఆంధ్రజ్యోతి): చేతిలో కర్రలు, రాడ్లు పట్టుకుని పదుల సంఖ్యలో యువకులు రోడ్డు మీదకు రావడం చూశారా..? సినిమా తరహా ఇలాంటి సంఘట నలు ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా నగరంలో నిత్యం కనిపి స్తూనే ఉన్నాయి. ఎక్కడైనా చిన్న గొడవ అయితే చాలు వెంటనే రయ్యిమంటూ ద్విచక్రవాహనాలపై పదుల సంఖ్య లో యువకులు అక్కడికి చేరుకోవడం.. తమకు మించిన వీరులు లేరన్న రీతిలో ఎదుటివారిపై దాడులకు తెగ బడటం లాంటి వింతపోకడలకు అలవాటు పడ్డాయి నగరంలోని అల్లరిమూకలు. ప్రస్తుతం జిల్లాలో కొందరు యువకులు గ్రూపులుగా ఏర్పడి.. గొడవలు పెట్టుకోవడం, పదిమందిని వెంటపెట్టుకుని తిరగడం, సెటిల్మెంట్ల పేరు తో ఎదుటివారిని బెదిరించడం లాంటివి వారికొక ఫ్యాషన్‌గా మారింది. పలు గొడవల్లో అత్యధికంగా 20ఏళ్ల వయస్సున్న యువకులే ఉండటం గమ నార్హం. ఖమ్మంనగరంలోని పలుప్రాంతాలకు చెందిన కొందరు యువకులు త్రీ టౌన్‌, గాంధీ చౌక్‌లో, గట్టయ్యసెంటర్‌, సరితా క్లినిక్‌, ముస్తఫా నగర్‌ లాంటి పలుప్రాంతాల్లో ఈ తరహా దందాకు పాల్పడుతున్నట్టు సమాచారం. 

ఎదుటి వ్యక్తులు భయపడేలా.. 

పెద్ద వాపారులు, సంపన్నుల కుటుంబాల్లోని ఆస్తి, భూమి, ఇతర అంతర్గత వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్‌ చేస్తామంటూ ఆ వివాదంలోని ఒకరితో ఒప్పందాలు చేసుకుని.. ఎదుటి వ్యక్తిని భయపెట్టేందుకు ప్రయత్నిస్తుండటం అల్లరిమూకలకు అలవాటుగా మారిం ది. సెటిల్‌మెంటులో భాగంగా కొందరు యువకులను వెంటపెట్టుకుని దర్జాగా దందా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక వంకతో అవతలి వర్గం వారిపై గొడవకు దిగడం, కార్యాలయాలు, ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేస్తామంటూ బెదిరింపులకు దిగుతారు. అయినా వినకపోతే సదరు వ్యాపారులు బయపడేలా రెక్కీలు నిర్వహిస్తారు. ఆయా వ్యక్తులు, వారి కుటుంబసభ్యులు రాక పోకలు సాగించే దారిలో కాపుకాయడం, వారి ఎదురుగా వికృతచర్యలకు పాల్పడటం, సినిమాల్లోని రౌడీల్లా బ్యాట్లు, కర్రలులాంటి పట్టుకుని వారి వాహనాలను వెంబడించడం లాంటివి చేస్తుంటారు. సదరు సంపన్నులకు చెందిన వ్యాపార సంస్థలు, ఇళ్ల వద్ద తమ అనుచరులను పెడ తారు. వారినిగమనించిన సదరు వ్యాపారులు వారి చేష్ట లకు భయపడి వారిని లోపలికి పిలిచి ఎంతోకొంత బేరం కుదుర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సరిగ్గా తమ విషయంలో ఇదే జరిగిందని కొందరు వ్యాపారులు వాపోతుండగా, కొందరు మాత్రం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగడం లేదని ఆరోపిస్తున్నారు. 

కూలీ ఇచ్చి.. మందు పోస్తే చాలు...

కొందరు వ్యక్తులు ఖమ్మంలో దందా సంస్కృతికి తెరలే పారన్న ఆరోపణలు వినిపిస్తుండగా.. తమ వెంట వచ్చే యువకులకు రోజువారీ కూలీఇచ్చి సాయంత్రానికి మద్యం పోయిస్తున్నారని, దానికి ఆశపడుతున్న యువత ఈజీ మనీకి అలవాటు పడి తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటు న్నారని తెలుస్తోంది. ఇలా కొందరు వ్యక్తులు యువకులకు రోజుకు రూ.500 కూలితో పాటు సాయంత్రానికి క్వార్టర్‌ మద్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. అవి తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు సదరు దందా నడిపే వ్యక్తులు ఏది చెబితే ఆ పని చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇలా దందా చేసే సమయంలో ఆ గ్యాంగ్‌ను ఎవరైనా ఎది రిస్తే తమకు అధికార పార్టీ అండదండలున్నాయని, కేసు లు పెట్టుకున్నా తమకేం కాదని, అంతటితో ఆగకుండా తమకు పోలీసుశాఖలో పరిచయాలున్న ఉన్నతాధికారుల పేర్లు కూడా చె బుతుండటంతో టార్గెట్‌ అయినవారు బెంబేలెత్తిపోతున్నారు. 

గతంలో జరిగిన పలు సంఘనటలు.. 

ఖమ్మం నగరంలోని ఎన్నెస్టీ రోడ్డులో బైకుపై వెళ్తున్న ఓ పీడీతో ఇద్దరు యువకులు వాగ్వాదానికి దిగి.. హెల్మెట్‌తో దాడి చేసిన సంఘటన అప్పట్లో దుమారాన్నే లేపింది. దానికంటే కొద్ది రోజులే ముందే ఇద్దరు పోలీసు ఉద్యోగులు బస్టాండ్‌ కాంప్లెక్స్‌లో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన విష యం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అంతకుముందు ఖమ్మం జడ్పీసెంటర్‌లో నడిరోడ్డుపై ఇరువర్గాల వారు కర్ర లతో కొట్టుకోవడం గ్యాంగ్‌వార్‌కు నిదర్శనంగా నిలిచింది. వీటితోపాటు గతంలో ఖమ్మం నగర శివారులోని ఓ కళా శాలలోని సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులు రెండు గ్యాంగ్‌ లుగా విడిపోయి దాడిచేసుకున్నారు. మరో కళాశాలలో రెండు గ్యాంగ్‌లు గొడవపడిన పంచాయితీ కాస్త ఓవిద్యార్థి సంఘం నాయకుడి వద్దకు చేరింది. మరొక నర్సింగ్‌ కళా శాలలోనూ ఇదే పరిస్థితి. ఇలాంటి సంఘటనలు నగరం లో పెచ్చుమీరుతున్న అల్లరిమూకలకు, గ్యాంగ్‌ తరహా సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తున్నాయని, ఇలాంటివాటిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని, పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-07-25T04:59:34+05:30 IST