క్రీడా ప్రాంగణాలతో ఒత్తిడి దూరం

ABN , First Publish Date - 2021-06-22T05:51:26+05:30 IST

నిరంతరం ఒత్తిడితో పనిచేసే పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు, శారీరక ధారుడ్యం, మనోవికాసం పెంపునకు క్రీడా ప్రాంగణాలు దోహదపడతాయని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు పేర్కొన్నారు.

క్రీడా ప్రాంగణాలతో ఒత్తిడి దూరం
క్రీడా ప్రాంగణాలను ప్రారంభిస్తున్న డీఐజీ రంగారావు, ఎస్పీ కృష్ణారావు

విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు 

విశాలాక్షినగర్‌, జూన్‌ 21: నిరంతరం ఒత్తిడితో పనిచేసే పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు, శారీరక ధారుడ్యం, మనోవికాసం పెంపునకు క్రీడా ప్రాంగణాలు దోహదపడతాయని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు పేర్కొన్నారు. కైలాసగిరి పోలీస్‌ మైదానం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షటిల్‌ ఇండోర్‌ స్టేడియంతో పాటు బ్యాడ్మింటన్‌ కోర్టు, జూనియర్‌ ఆఫీసర్ల వెయిటింగ్‌ హాల్‌ నిర్మాణాలను డీఐజీ, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీసులు క్రీడా ప్రాంగణాలను వినియోగించుకుని మంచి ప్రావీణ్యం పొంది, అత్యుత్తమ క్రీడాకారులుగా గుర్తింపు పొందాలని పిలుపునిచ్చారు. క్రీడా ప్రాంగణాలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన జిల్లా ఎస్పీ, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ డీఎస్పీ ఆర్‌పీఎల్‌ శాంతికుమార్‌తో పాటు సిబ్బందిని ప్రశంసించారు. అనంతరం జిల్లాలో కరోనా బారినపడిన పోలీసులకు, వారి కుటుంబాలకు సేవలందించిన సిబ్బందికి నగదు రివార్డులను డీఐజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఎస్‌ఈబీ రాహుల్‌దేవ్‌ సింగ్‌, ఏఎస్పీ (ఆపరేషన్స్‌) ఎస్‌.సతీశ్‌కుమార్‌, డీఎస్పీ ఎస్‌.అప్పలనాయుడు, డీటీసీ డీఎస్పీ కె.ప్రవీణ్‌కుమార్‌, ఎస్సీ ఎస్టీ సెల్‌ డీఎస్పీలు పి.శ్రీనివాసరావు, ఎ.వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T05:51:26+05:30 IST