ఒత్తిడిని తగ్గించే పనస విత్తనాలు!

Published: Sat, 09 Jul 2022 11:15:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఒత్తిడిని తగ్గించే పనస విత్తనాలు!

పనస పండు చూడటానికి పెద్దగా ఉంటుంది. మనదేశంతో పాటు శ్రీలంక, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌లో విపరీతంగా కాసే ఈ పనసపండును ‘విజిటబుల్‌ మీట్‌’ అని కూడా ముద్దుగా పిలుస్తారు. పండు సైజులానే ప్రొటీన్లు, న్యూట్రిన్లు పుష్కలం. ఈ తీపి పండులో ఉండే విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. 


  • పనసపండు లోపలి విత్తనాలకు మార్కెట్లో డిమాండ్‌ ఉంటుంది. వీడిని పొడి చేసి పిండిని అమ్ముతుంటారు. ఈ పొడిలో థయామిన్‌, రైబోఫ్లోవిన్‌ పుష్కలం. ఊరగాయల్లో, పొడి రూపంలో తీసుకున్న వెంటనే సత్వర శక్తి వస్తుంది. జీర్ణాశయంలోని ఆహారం త్వరగా అరగడానికి ఉపయోగపడుతుంది. చైనాలాంటి దేశాల్లో పనసపండు విత్తనాల పొడిని జీర్ణాశయ సంబంధ వ్యాధులను క్యూర్‌ చేయటానికి ఉపయోగిస్తారు.
  • పనసపండు విత్తనాలను ఆవుపాలు లేదా గేదెపాలలో (అవి కూడా పచ్చిపాలు ఉండాలి)రెండు స్పూన్లు వేసి విత్తనాలను చూర్ణం చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • ప్రొటీన్లు, మైక్రో న్యూట్రిన్లు అధికంగా ఉండటం వల్ల వీటిని తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. కొన్ని రకాల చర్మ వ్యాధులు పోతాయి. జుట్టు బాగా పెరుగుతుంది కూడా.
  • ఇందులో ఐరన్‌శాతం ఎక్కువ. అనీమియాతో పాటు ఇతర రక్తసంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. జాక్‌ఫ్రూట్‌ సీడ్స్‌ తింటే గుండెకు మంచిది. ఈ విత్తనాల్లో ఎ-విటమిన్‌ ఉండటం వల్ల కంటికి మంచిది. 
  • ప్రొటీన్లు పుష్కలం కాబట్టి కండరాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. 
  • ఇన్ని సహజగుణాలు వీటిలో ఉన్నాయి కాబట్టి.. పనసపండు విత్తనాలు ఇటు ధరలోనూ, అటు ఉపయోగంలోనూ ఆల్మండ్స్‌తో పోటీకి వస్తాయి. 
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.