ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు : డీఐఈవో

ABN , First Publish Date - 2022-06-25T05:26:30+05:30 IST

ఇంటర్‌ పాసైన విద్యార్థులకు టీసీలు ఇచ్చే విషయంలో ప్రైవేట్‌ కళాశాలలు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఐఈవో రఘురాజ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు : డీఐఈవో

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 24: ఇంటర్‌ పాసైన విద్యార్థులకు టీసీలు ఇచ్చే విషయంలో ప్రైవేట్‌ కళాశాలలు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఐఈవో రఘురాజ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అఽధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


Updated Date - 2022-06-25T05:26:30+05:30 IST