నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ABN , First Publish Date - 2021-05-15T05:03:47+05:30 IST

కొవిడ్‌ నియంత్రణలో భాగంగా విధించిన కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ శుక్రవారం హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

కడప(క్రైం), మే 14: కొవిడ్‌ నియంత్రణలో భాగంగా విధించిన కర్ఫ్యూ నిబంధనలు  ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ శుక్రవారం హెచ్చరించారు. కర్ఫ్యూ సమయాల్లో షాపులు తెరిచిన దుకాణ యాజమానులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే మాస్కులు ధరించని వారిపై జరిమానాలతో పాటు విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా మాస్కులు ధరించని వారిని గుర్తించి 563 కేసులు నమోదు చేసి రూ.80,975 జరిమానా విఽధించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉందని అన్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని తెలిపారు. అలాగే దుకాణదారులు తమ దుకాణాలకు వచ్చేవారు మాస్కులు వేసుకుని, భౌతికదూరం పాటిస్తూ సరుకులు కొనుగోలు చేసేలా చూసుకోవాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-05-15T05:03:47+05:30 IST