కట్టుదిట్టంగా కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-09T04:56:29+05:30 IST

పులివెందుల పరిధిలో కర్ఫ్యూ కట్టుదిట్టం గా చేపడుతున్నారు. పట్టణంలో శనివారం అన్ని వీధుల్లో దుకాణాలు మూతపడ్డాయి.

కట్టుదిట్టంగా కర్ఫ్యూ
నిర్మానుష్యంగా ఉన్న పూలంగళ్ల సర్కిల్‌ రోడ్డు

పులివెందుల టౌన, మే 8: పులివెందుల పరిధిలో కర్ఫ్యూ కట్టుదిట్టం గా చేపడుతున్నారు. పట్టణంలో శనివారం అన్ని వీధుల్లో దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్టాండ్‌లోకి వాహనాలు వెళ్లకుండా బారికే డ్లు ఏర్పాటు చేశారు. పండ్లు, పూలు, పాల వ్యాపారం కర్ఫ్యూతో సం బంధం లేకుండా నిర్వహించారు. ఉదయం 6గంటల నుంచే పట్టణం లో వీధులన్నీ రద్దీగా మారాయి.

పట్టణంలో అంబులెన్సులు అధికం గా నడిచాయి. కర్ఫ్యూ సమయంలో ద్విచక్ర, లగేజీ వాహనాలను అనుమతించారు. పట్టణంలో వాహనాల రాకపోకలను కట్టడి చేయ డానికి శ్రీనివాస హాల్‌ సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండ్‌, ముద్దనూరు రోడ్డు సర్కిల్‌, పార్నపల్లె రోడ్డు, పూలంగళ్ల సర్కిల్‌, పుల్లారెడ్డి ఆస్పత్రి ఏరి యా, అంబకపల్లె రోడ్డుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.
అంతేకాకుం డా పట్టణ సరిహద్దుల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే పట్టణంలోకి అనుమతించారు. పట్టణంలో మాస్కులు ధరిం చని ద్విచక్ర వాహనచోదకులకు జరిమానా విధించారు. మున్సిపల్‌ అధికారులు పట్టణంలో కరోనా నివారణపై అవగాహన ప్రచారం నిర్వహించారు.

అలాగే కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాల యజమానులకు మున్సిపల్‌ కమీషనర్‌ నరసింహారెడ్డి, ఎస్‌ఐ చిరంజీ వి హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం నుంచే వైనషాపుల వద్ద అయితే పరిస్థితి చెప్పనవసరం లేదు. 

Updated Date - 2021-05-09T04:56:29+05:30 IST