నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-06-25T05:28:08+05:30 IST

నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీ సుకొని లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్‌ హెచ్చరించారు.

నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు


ఆర్మూర్‌రూరల్‌, జూన్‌24: నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీ సుకొని లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్‌ హెచ్చరించారు. శుక్రవారం ఆర్మూర్‌లోని రైతు వేదిక భవనంలో నియోజకవర్గ స్థాయిలో విత్తన డీలర్లు, ఎరువుల డీలర్లు, పీఏసీఎస్‌ కార్యదర్శులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలంలో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతీ ఒక్క డీలర్‌ రైతులకు విక్రయించిన విత్తనాలు, ఎరువులకు సంబంధించిన రశీదులను తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. రైతులు కూడా తమ అవసరాల మే రకే యూరియాను వినియోగించాలని సూచించారు. ఎరువులు వాడేటప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని రైతులను కోరారు. కార్యక్రమంలో సహయ వ్యవసాయ సంచాలకులు విజయలక్ష్మి, ఏవోలు హరికృష్ణ, పద్మ, జ్యోష్న భవాని, శ్రీనివాస్‌, గోపి పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T05:28:08+05:30 IST