నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-05-18T03:44:14+05:30 IST

నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుం టామని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అగ్రికల్చర్‌ శివానంద్‌, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్‌లు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఫెర్టిలైజర్‌ షా పుల్లో పోలీసు, వ్యవసాయాధికారులు తనిఖీలు చేపట్టి దుకాణదారులకు కౌన్సెలింగ్‌ నిర్వహించా రు. విత్తనాలు, ఎరువులకు బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
ఎరువుల దుకాణంలో తనిఖీలు చేస్తున్న అధికారులు

ఏసీసీ, మే 17: నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుం టామని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అగ్రికల్చర్‌ శివానంద్‌, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్‌లు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఫెర్టిలైజర్‌ షా పుల్లో పోలీసు, వ్యవసాయాధికారులు తనిఖీలు చేపట్టి దుకాణదారులకు కౌన్సెలింగ్‌ నిర్వహించా రు. విత్తనాలు, ఎరువులకు బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, రవాణా, కొనుగోలు చేసినా చర్యలు ఉంటాయని తెలిపారు.  విత్తన ధ్రువీకరణ అధికారి దుర్గేష్‌, డీఏవో కల్పన, ఏడీఏ అనిత, ఏవో కృష్ణ, పాల్గొన్నారు. 

తాండూర్‌: మండలంలోని విత్తన దుకాణాల్లో  వ్యవసాయ, పోలీసు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్‌, స్టాక్‌ రిజిష్టర్‌లు, బిల్‌ పుస్తకాలను పరిశీలించారు. ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలు, ఎరువుల ను అమ్మాలని సూచించారు. వ్యవసాయ కమిష నరేట్‌ ఏడీఏ శివానంద్‌, చెన్నూరు ఏడీఏ బాపు, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ లచ్చన్న, ఏఈవో కిరణ్మయి పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-18T03:44:14+05:30 IST