నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-05-20T06:51:46+05:30 IST

నకిలీ, నిషేధిత విత్తనాలు, మందులు విక్ర యిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాదగిరిగుట్ట ఏడీఏ, ప్రత్యేక తనిఖీ బృందం అధికారి డి.పద్మావతి హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ఆలేరులో విత్తనాల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న ప్రత్యేక అధికారుల బృందం

ఆలేరు రూరల్‌, మే 19:నకిలీ, నిషేధిత విత్తనాలు, మందులు విక్ర యిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాదగిరిగుట్ట ఏడీఏ, ప్రత్యేక తనిఖీ బృందం అధికారి డి.పద్మావతి హెచ్చరించారు. గురువారం ఆలేరు, కొలనుపాకలో ప్రభుత్వ అనుమతి పొందిన ఎరువుల దుకాణా లను రికార్డులు, స్టాకు రిజిస్ట్రర్లను ఆమె పరిశీలించి మాట్లాడారు.  గైపో సైట్‌ గడ్డిరకం మందులు, హెపీ రకం పత్తివిత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేయిస్తామన్నారు.  రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పత్తి, కంది సాగు రైతులు ఏవోల, ఏఈవోల సలహాలను పాటించాలన్నారు. రైతులు ఖరీదు చేసిన ప్రతీ దానికి రసీదు ఇవ్వాలని ఆమె దుకాణాదారులను ఆదేశినంచారు.  ఆమెతో పాటు ఏవోలు పద్మజ లావణ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, ఉన్నారు.. 

వ్యాపారులు నిబంధనలు పాటించాలి

మోత్కూరు: ఎరువులు, విత్తనాల వ్యాపారులు నిబంధనలు పాటిం చకపోతే  క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని డీలర్లను మండల వ్యవసాయాధికారి కె.స్వప్న హెచ్చరించారు. గురువారం మండలంలోని పాటిమట్ల క్రాస్‌ రోడ్డులో ఉన్న ఎన్‌ఎస్‌ ట్రేడర్స్‌ ఎరువులు, విత్తనాల దుకాణాన్ని ఆమె తనిఖీ చేసి మాట్లాడారు. మోత్కూరు రైతుసేవా సహకార సంఘంలో జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని 30 కిలోల సంచికి రూ.665 చెల్లించి రైతులు తీసుకోవచ్చన్నారు.  కార్యక్రమంలో దుకాణం యజమాని నరేష్‌, రైతులు పాల్గొన్నారు.

 


Updated Date - 2022-05-20T06:51:46+05:30 IST