ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-06-17T05:56:51+05:30 IST

ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ కమిషనర్‌ డా. జి.సజన హెచ్చరించారు. బుధవారం ఆమె 4వజోన్‌లోని పాండురంగాపురం, బీచ్‌ రోడ్డు, ఎంవీపీ కాలనీ సెక్టర్‌ -9, ఫిషర్‌మెన్‌ కాలనీ ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలో ఎక్కడా పుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికాకుండా చూడాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే కఠిన చర్యలు
ఫుట్‌పాత్‌పై కూరగాయలమ్ముతున్న వారిని హెచ్చరిస్తున్న జీవీఎంసీ కమిషనర్‌ సృజన

జీవీఎంసీ కమిషనర్‌ డా.సృజన 

బీచ్‌ రోడ్డు జూన్‌ 16: ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ కమిషనర్‌ డా. జి.సజన హెచ్చరించారు.  బుధవారం ఆమె 4వజోన్‌లోని పాండురంగాపురం, బీచ్‌ రోడ్డు, ఎంవీపీ కాలనీ సెక్టర్‌ -9, ఫిషర్‌మెన్‌ కాలనీ ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలో ఎక్కడా పుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికాకుండా చూడాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. రెండు రోజుల పారిశుధ్య కార్మికుల సమ్మె కారణంగా నగరంలో చెత్త పేరుకుపోయిందని, అదనపు గంట లు పనిచేసి చెత్తను ఎత్తించాలని, ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించాలన్నారు. రోడ్లు, కాలువలు, గెడ్డలలో పేరుకుపోయిన చెత్తను యుద్ధప్రాతిపదికన తరలించాలన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వ లు లేకుండా చూడాలని, డంపర్‌ బిన్ల చుట్టూ బ్లీబింగ్‌  చల్లించాలన్నారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్‌ .ఎల్‌.జి.శాస్త్రి, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, ఏసీబీ భాస్కర్‌ బాబు, చిరంజీవి శ్రీనివాస్‌, పి.శ్రీనివాసరావు, ఏఎంహెచ్‌వో రమణమూర్తి, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T05:56:51+05:30 IST