ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-06-25T06:09:16+05:30 IST

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కనిగిరి ఆర్డీవో సందీప్‌కుమార్‌ హెచ్చరించారు.

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు
రికార్డులను పరిశీలిస్తున్న కనిగిరి ఆర్డీవో సందీప్‌కుమార్‌

కనిగిరి ఆర్డీవో సందీప్‌కుమార్‌

సమగ్ర నివేదికలు అందించాలని తహసీల్దార్‌కు ఆదేశం 

కొనకనమిట్ల, జూన్‌ 24: ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కనిగిరి ఆర్డీవో సందీప్‌కుమార్‌ హెచ్చరించారు. ‘భూంఫట్‌’ శీర్షికన ‘ఆంధ్ర జ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. చినారికట్లలో ఆక్రమణకు గురైన పశువుల బీడు భూములను తహసీల్దార్‌ భాగ్యలక్ష్మి, ఆర్‌ఐలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మండలంలో ఇంత భూమి ఆక్రమణకు గురవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. సమగ్ర సర్వే చేయించి పూర్తి స్థాయిలో నివేదికలు తనకు అందజేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఆక్రమణదారులను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వాలన్నారు. అదేవిధంగా పంటలు సాగు చేసుకుంటున్న వారిని భూమిలో నుంచి తొలగించాలని ఆదేశించారు. ఈయన వెంట ఆర్‌ఐ ప్రకాష్‌, వీఆర్‌వో పురుషోత్తంరెడ్డి, మండల సర్వేయర్‌ దర్బార్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-06-25T06:09:16+05:30 IST