శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-08-03T06:22:40+05:30 IST

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ అన్నారు.

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న సీపీ సత్యనారయణ

- సీపీ సత్యనారాయణ 

జమ్మికుంట, జూలై 2: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ అన్నారు. సోమవారం జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. స్టేషన్‌ పరిసర ప్రాంతాలు పరిశీలించారు. ఆనంతరం సీపీ మాట్లాడుతూ లాండ్‌ ఆర్డర్‌ కంట్రోల్‌ చేయడానికి ఒక్కో మండలానికి ఒక్కో డీఎస్పీ స్థాయి అధికారి ఉన్నట్లు తెలిపారు. శాంతి  భద్రతలను కాపాడటమే పోలీసుల బాధ్యత ఆన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు రాబోతున్నాయని, నోటిఫికేషన్‌ ముందు, నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత, కౌంటింగ్‌ అయిన తర్వాత పోలీస్‌ల విధులు కీలకంగా ఉంటాయన్నారు. ఘర్షణ పూరిత వాతావరణం, వైషమ్యాలు లేకుండా చూస్తామన్నారు. ఘర్షణను ప్రేరేపించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. హుజూ రాబాద్‌ నియోజకవర్గంలో నాలుగు మండలాలు, అందులో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయని, ఇప్పటి వరకు ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఇంచార్జ్‌ ఏసీపీ ప్రకాష్‌, సిఐ కె రామచందర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.  

ఫ వీణవంక : గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి ఘర్షణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీపీ సత్యనారాయణ అన్నారు. సోమవారం వీణవంక మండలంలోని చల్లూరులో గ్రామస్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఎన్నికల్లో ఇరువర్గాలు సంయమనం పాటించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, ఇన్‌చార్జీ ఏసీపీ విజేందర్‌రెడ్డి, రూరల్‌ సీఐ సురేష్‌, ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఫ ఇల్లందకుంట : ఇల్లందకుంట పోలీస్‌స్టేషన్‌ను సీపీ సత్యనారాయణ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు పోలీస్‌ సిబ్బంది సహకరించాలని, వారిపై దురుసుగా ప్రవర్తించవద్దని సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్‌హెచ్‌వో రజినీకాంత్‌, ఎస్‌ఐ తోట తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T06:22:40+05:30 IST