నిషేధిత పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-05-15T05:28:12+05:30 IST

నిషేధిత పత్తి విత్తనాలు, ఎరు వులు, పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్‌ అగ్రికల్చర్‌ అధికారి శివానంద్‌ పేర్కొన్నారు.

నిషేధిత పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
చెన్నూరులో ఫెర్టిలైజర్‌ షాపులో తనిఖీలు చేస్తున్న వ్యవసాయ కమీషనర్‌ కార్యాలయం డీడీఏ శివానంద్‌

జైపూర్‌, మే 14: నిషేధిత పత్తి విత్తనాలు, ఎరు వులు, పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్‌ అగ్రికల్చర్‌ అధికారి శివానంద్‌ పేర్కొన్నారు. శనివారం పలు ఫెర్టిలైజర్‌ షాపులను తనిఖీ చేశారు. ఫెర్టిలైజర్‌ షాపుల్లో విత్తనా లకు సంబంధించిన రికార్డులను, గోదాములను, పత్తి విత్తనాల ప్యాకెట్లను, లైసెన్స్‌లను పరిశీలించారు. షాపుల యాజమానులు ప్రభుత్వం అనుమతించిన విత్తనాలను మాత్రమే అమ్మాలని, రైతులు కొన్న వాటికి రశీదులను అందజేయాలని సూచించారు. గోదాముల్లో పురుగుల మందులు, ఎరువులతో కలిసి నిల్వ ఉంచరాదని సూచించారు. హెచ్‌టీ పత్తి విత్త నాలు, గ్లైఫోసెట్‌ గడ్డి మందుకు సంబంధించిన విష యాలు తెలిస్తే వ్యవసాయాధికారులకు తెలియజేయా లన్నారు. తనిఖీల్లో ఏడీఏ జే.బాపు, టాస్క్‌ఫోర్స్‌ సీఐ అశోక్‌కుమార్‌, ఏవో మార్క్‌ గ్లాడ్సన్‌ పాల్గొన్నారు.

ఫ భీమారం: ఫెర్టిలైజర్‌ షాపుల యజమానులు రైతులకు నకిలీ విత్తనాలు, గ్లైఫోసెట్‌ మందులు విక్ర యిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ శివానంద్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని ఫెర్టిలైజర్‌ షాపు లను తనిఖీ చేశారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారనే అనుమానం ఉన్న వ్యక్తుల ఇండ్లలో, సమీప ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. 

ఫ చెన్నూరు:  చెన్నూరు పట్టణంలోని పలు ఫెర్టిలైజర్‌ షాపులను వ్యవసాయ కమిషనర్‌ కార్యాల యం డీడీఏ శివానంద్‌ తనిఖీ చేశారు. స్టాకు రిజిష్ట ర్‌లను పరిశీలించారు. గోదాంలను పరిశీలించి సూచ నలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఫెర్టిలైజర్‌ షాపు ల యాజమానులు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్ర యిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు లు కొన్న వాటిని తప్పని సరిగా రశీదులను అం దించాలన్నారు. నిషేధిత విత్తనాలను విక్రయిస్తే షాపుల లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు. సీడ్‌ సర్టిఫికెట్‌ ఆఫీసర్‌ దుర్గేష్‌, టాస్క్‌ఫోర్స్‌ సీఐ అశోక్‌, ఏడీఏ బాపు, ఏవో మహేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-15T05:28:12+05:30 IST