బంద్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-03-06T06:29:25+05:30 IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిర్వహించిన రాష్ట్రబంద్‌లో రాజమహేంద్రవరంలోని విద్యాసంస్థలన్నీ సంపూర్ణంగా పాల్గొని విజయవంతం చేశాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌.రాజా, బి.పవన్‌ పేర్కొన్నారు.

బంద్‌ విజయవంతం
అనపర్తిలో రాస్తారోకోలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

  • ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల మద్దతు
  • ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజా, పవన్‌
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలు

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 5: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిర్వహించిన రాష్ట్రబంద్‌లో రాజమహేంద్రవరంలోని విద్యాసంస్థలన్నీ సంపూర్ణంగా పాల్గొని విజయవంతం చేశాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌.రాజా, బి.పవన్‌ పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లాలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వం ఇచ్చిన బంద్‌ పిలుపునకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా స్పందించాయన్నారు. శుక్రవారం బంద్‌ సందర్భంగా ప్రభుత్వ, మున్సిపల్‌, ఎయిడెడ్‌ విద్యాసంస్థల వద్దకు వెళ్లి విద్యార్థులను బంద్‌లో పాల్గొనాల్సిందిగా పిలుపు ఇవ్వడంతో తరగతులను బహిష్కరించి బంద్‌లో పాల్గొన్నారన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఉత్తరకొరియా కంపెనీ పోస్కోకు అమ్మడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు వి.రాంబాబు, లోవరాజు, రవి, రోహిత్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారని తెలిపారు.

Updated Date - 2021-03-06T06:29:25+05:30 IST