సార్వత్రిక సమ్మె విజయవంతం

ABN , First Publish Date - 2020-11-27T05:47:46+05:30 IST

కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన సార్వతిక సమ్మె ఆదోనిలో విజయవంతమైందని ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు అజయ్‌బాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ తెలిపారు.

సార్వత్రిక సమ్మె విజయవంతం
డోన్‌లో ఎడ్లబండ్ల ర్యాలీ

ఆదోని, నవంబరు 26: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన సార్వతిక సమ్మె ఆదోనిలో విజయవంతమైందని   ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు అజయ్‌బాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ  తెలిపారు.  గురువారం  సార్వత్రిక సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి  పెద్ద ఎత్తున ర్యాలీగా  బయలుదేరి ఎమ్మిగనూరు సర్కిల్‌, భీమాస్‌ సర్కిల్‌ మీదుగా శ్రీనివాస్‌ భవన్‌ ప్రాంతంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు.  కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను కుదించడం దుర్మార్గమన్నారు. నాయకులు ప్రకాష్‌, వెంకన్న, వీరేష్‌, ఓబీ నాగరాజు, కల్లుబావి రాజు,   గోపాల్‌, మహానందరెడ్డి,   మల్లికార్జున, మన్నెమ్మ, సుజ్ఞానమ్మ పాల్గొన్నారు. 


హొళగుంద: హొళగుందలో గురువారం సార్వత్రిక సమ్మె విజయవంత మైంది.  తేరుబజార్‌ నుంచి బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు హనుమంతు, కార్మిక సంఘ నాయకులు కాళప్ప, పెద్దహ్యాట మారెప్ప, వెంకటేశ్‌, విద్యార్థి సంఘ నాయకులు నాగరాజు, శ్రీరంగ, రమేష్‌ పాల్గొన్నారు. 


ఆస్పరి:  కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై గురువారం  సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆస్పరిలో ఆందోళన నిర్వహిచారు. సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో  తహసీల్దార్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. నాగేంద్రయ్య, చిన్నసుంకన్న, బాలకృష్ణ, విరుపాక్షి, నల్లారెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు. 


చిప్పగిరి: ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ మండల కార్యదర్శి అంజి, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా సహాయ కార్యదర్శి గోవర్ధన అన్నారు. గురువారం మండల కేంద్రం చిప్పగిరిలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద సార్వత్రిక సమ్మె లో భాగంగా అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు, గ్రామ సేవకులు, వెలుగు యానిమేటర్లతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. 


ఆదోని రూరల్‌: కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ భారతదేశాన్ని కాపాడాలని కార్మిక సంఘ నాయకులు వెంకటేశులు, రామాంజనేయులు, హుసేన్‌, తిక్కయ్య, అంజినయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు పాండవగల్లు గ్రామం లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.  


డోన్‌(రూరల్‌): కార్మిక హక్కులను హరిస్తే సహించమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజినేయులు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు  సుంకన్న,  నియోజకవర్గ కార్యదర్శి అబ్బాస్‌, సీఐటీయూ మండల కార్యదర్శి శ్రీరాములు హెచ్చరించారు. గురువారం సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక  సంఘాల నాయకులు  సురేంద్ర, తిమ్మయ్య, ఎస్తేరమ్మ, చాందినీ  పాల్గొన్నారు.


రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలి

 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజినేయులు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. గురువారం సార్వత్రిక సమ్మెలో భాగంగా రైతు వ్యతిరేక బిల్లుకు నిరసనగా సీపీఐ, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎడ్లబండ్లతో ప్రదర్శనగా వెళ్లి జాతీయ రహదారిని దిగ్బంధించారు.  పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నాయకులను పోలీసులు అరెస్టు చేసి పట్టణ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.  

 బేతంచెర్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం సార్వత్రిక సమ్మెలో భాగంగా  సీపీఎం జిల్లా కార్యదర్శి రమే్‌షకుమార్‌, సీపీఎం మండల కార్యదర్శి ఎల్లయ్య మాట్లాడుతూ అసం ఘటిత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.  సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌ నుంచి కొత్తబస్టాండు వరకు భారీ ర్యాలీ  నిర్వహించారు. సీపీఐ నాయకులు నాగరాజు, భార్గవ్‌, లారీ, భవన, ఆటో, హమాలీ, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, గ్రామ సేవకులు, ఉపాధి, పాలీష్‌, చిన్న వ్యాపారులు పాల్గొన్నారు.  


మద్దికెర: సార్వత్రిక సమ్మెలో భాగంగా  మద్దికెర   బస్టాండ్‌ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఇందులో  సీపీఎం నాయకులు దస్తగిరి, మాదన్న, సీపీఐ నాయకులు నాగరాజు, కోదండరాముడు, హనుమప్ప  తదితరులు పాల్గొన్నారు. బంద్‌ సందర్భంగా   గ్రామంలోని పాఠశాలలు, బ్యాంకులు, కళాశాలలను మూసివేశారు.  


తుగ్గలి: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం తగదని సీపీఐ, సీపీఎం జిల్లా నాయకులు నబిరసూల్‌, నారాయణ  అన్నారు. గురువారం  తుగ్గలిలో సార్వత్రికసమ్మెలో భాగంగా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 


నందవరం: వ్యవసాయ బిల్లు రద్దుచేయాలని  నందవరంలో గురువారం రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతు, కేవీపీఎస్‌ సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు గురుశేఖర్‌, దేవసహాయం, దేవపుత్ర, సోమేశ్వరరెడ్డి పాల్గొన్నారు. 


గోనెగండ్ల:  ఎమ్మిగనూరు, కర్నూలు ప్రదాన రహదారిపై నాయకులు అర గంట రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. మద్దిలేటి నాయుడు, రాఘవేంద్ర, నరసింహులు, కరుణాకర్‌, నబిరసూల్‌, బతకన్న, మిన్నల్లా, అశోక్‌నాయుడు, అక్బర్‌, రామ్మెహన్‌, రామచంద్ర పాల్గొన్నారు.


మంత్రాలయం: కేంద్ర ప్రభుత్వం లేబర్‌ కోడ్‌ను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘం నాయకులు లింగన్న, జయరాజు డిమాండ్‌ చేశారు. గురువారం మంత్రాలయంలో వ్యకాసం అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. ప్రాణేష్‌, విశాలాక్షి, ఫాతీమా, సుజాత, పుష్ప, రాజేశ్వరి, ప్రకాష్‌, ప్రసంగీ, మారెప్ప, వెంకటేశ్‌, రాజు పాల్గొన్నారు. 


కోసిగి: వామపక్షాలు, ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో బంద్‌  పాటించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువా రం భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం జిల్లా నాయకుడు సుభాన్‌ మాట్లా డారు. వాల్మీకి సర్కిల్‌లో మానవహారం నిర్వహించారు. గోపాల్‌, రాజు, రాము డు, మల్లికార్జున, వీరేష్‌, జిలానీ, హెప్పిబా రాణీ, వెంకటేష్‌, రామాంజినేయులు, తిమ్మప్ప, పూజారి శ్రీనివాసులు, సిద్దప్ప పాల్గొన్నారు.


ఎమ్మిగనూరు టౌన్‌: సీపీఐ, సీపీఎం, ఏస్టీయూ, యూటీఎఫ్‌,  ఏఐటీ యూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహిం చారు. నాయకులు గిడ్డయ్య, రామాంజినేయులు, పంపన్నగౌడ్‌, బసవరాజు, నాగమణి, భాగ్యలక్ష్మి, బాలరాజు, తిమ్మగురుడు, సత్యన్న పాల్గొన్నారు. 


పత్తికొండటౌన్‌: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం పత్తికొండలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు జరిగింది. సంపన్నలకు, కార్పొరేట్‌శక్తులకు కేంద్రంలోని నరేంద్రమోడీ ఊడిగం చేస్తున్నారని  సీపీఐ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.   పట్టణంలోని నాలుగు స్తంభాల కూడలిలో జరిగిన ధర్నాలో వారు ప్రసం గించారు.   కార్మిక, ప్రజాసంఘాల నాయకులు గురుదాసు, రంగారెడ్డి, రాజాసాహెబ్‌, సురేంద్ర, కృష్ణ, వెంకటేశ్వరరెడ్డి  పాల్గొన్నారు. 


గూడూరు:  సార్వత్రిక సమ్మె విజయవంతమైందని సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి జె.మోహన్‌ అన్నారు. గురువారం గూడూరు పట్టణంలో  ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన  కార్మికుల హక్కులను కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్‌బాబు, ఏఐటీయూసీ మండల నాయకుడు శ్రీనివాసులు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు సుహాసిని తదితరులు పాల్గొన్నారు. 


ఆలూరు: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆలూరు పట్టణంలో కార్మిక సంఘాలు  ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కేపీ నారాయణస్వామి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ కార్మికుల ప్రజావ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి షాకీర్‌, మైన, ఎస్‌ఎస్‌ బాషా, శేఖర్‌, విఠల్‌, రైతు సంఘం నాయకుడు ఈరన్న   పాల్గొన్నారు. 


ప్యాపిలి: కార్మిక చట్టాలను కాపాడాలని   సీపీఐ, సీఐటీయూ నాయకులు వెంకటేష్‌, ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు.  గురువారం ప్యాపిలిలో  సార్వత్రిక సమ్మెలో బాగంగా ర్యాలీలు, ధర్నాలు   నిర్వహించారు.  యూటీఎఫ్‌ లతీఫ్‌, అంగనవాడీ కార్యకర్తలు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, పారిశుద్య కార్మికులు, వెలుగు సిబ్బంది, హమాలీ, ఆటో యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు. 


కోడుమూరు: సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ, ఏఐ టీయూసీ, సీపీఎం, సీపీఐ నాయకులు రాజు, గఫూర్‌మియ్య, క్రిష్ణ, మునిస్వామి, షేర్‌ఖాన్‌, నారాయణ పాల్గొన్నారు.


కర్నూలు(రూరల్‌): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఆర్టీసీ పీటీడీ ఎంప్లా యీస్‌ సంఘీభావం తెలిపింది. ఈమేరకు ఉద్యోగులు కర్నూలు-2 డిపోలో మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైయ్యారు. నాయకులు కృష్ణ, రామకృష్ణ, రాజు, ఆనంద్‌, దాస్‌, రామశేషు,పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:47:46+05:30 IST