31 వేల ఏళ్ల క్రితం నాటి పుర్రెపై పరిశోధనలు.. దాని ఆధారంగా శిలాయుగం నాటి మహిళ ముఖ పునర్నిర్మాణం!

ABN , First Publish Date - 2022-10-02T02:24:18+05:30 IST

ప్రస్తుత చెక్ రిపబ్లిక్‌లోని గ్రామమైన మ్లాడెక్‌లోని ఒక గుహలో ఓ మానవుని పుర్రెను 1881లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

31 వేల ఏళ్ల క్రితం నాటి పుర్రెపై పరిశోధనలు.. దాని ఆధారంగా శిలాయుగం నాటి మహిళ ముఖ పునర్నిర్మాణం!

ప్రస్తుత చెక్ రిపబ్లిక్‌లోని గ్రామమైన మ్లాడెక్‌లోని ఒక గుహలో ఓ మానవుని పుర్రెను 1881లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానిపై అధ్యయనం చేసిన అప్పటి పరిశోధకులు ఆ పుర్రె సుమారు 31,000 సంవత్సరాల క్రితం నాటిదని, అది ఓ పురుషుడిదని వర్గీకరించారు. అయితే అప్పటి శాస్త్రవేత్తల వర్గీకరణ తప్పు అని, ఆ పుర్రె ఓ మహిళదని తాజా పరిశోధనలో వెల్లడైంది. గత పరిశోధకుల వర్గీకరణను దాదాపు 140 సంవత్సరాల తర్వాత  ఇప్పటి శాస్త్రవేత్తలు సరిచేశారు. 


ఇది కూడా చదవండి..

Tamil Nadu: నిజంగా ఈ బామ్మ గ్రేట్.. బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు నిరాకరించిన బామ్మ.. వైరల్ అవుతున్న వీడియో!


ఆ పుర్రె ఎగువ పురాతన శిలాయుగం (సుమారు 43,000 నుంచి 26,000 సంవత్సరాల వరకు)లో భాగమైన ఆరిగ్నాసియన్ కాలంలో నివసించిన 17 ఏళ్ల మహిళదని వెల్లడించారు. తమ పరిశోధన గురించి `The Forensic Facial Approach to the Skull Mladeč 1` అనే ఆన్‌లైన్ పుస్తకంలో శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. యూరోప్‌లో లభ్యమైన అత్యంత పురాతన హోమోసెపియన్స్‌కు సంబంధించిన లింగ నిర్ధారణను తాము ఎలా చేశామనే విషయం గురించి ఆ పుస్తకంలో శాస్త్రవేత్తలు వెల్లడించారు. `పుర్రెలోని ఒక్కో భాగాన్ని విశ్లేషిస్తే అది పురుషుడిదని అనిపించింది. అయితే ఆ కాలానికి చెందిన ఇతర డేటా మొత్తాన్ని పరిశీలిస్తే ఆ పుర్రె ఓ మహిళదని రుజువైంద`ని బ్రెజిల్‌కు చెందిన ఓ గ్రాఫిక్స్ ఎక్స్‌పర్ట్ పేర్కొన్నారు. 


యూరప్, ఆసియా, ఆఫ్రికాలకు చెందిన, వివిధ జన సమూహాలకు చెందిన పురాతన వ్యక్తుల డేటాను పరిశీలించి, ఆధునిక మానవుల 200 సీటీ స్కాన్లను పరిశీలించి ఆ పుర్రెను పునర్నిర్మించామని తెలిపారు. పుర్రెకు సంబంధించిన పూర్తి డిజిటల్ ఇమేజ్ వచ్చిన తర్వాత మొహాన్ని పునర్నిర్మించామని పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-02T02:24:18+05:30 IST