Indonesia: భారీ భూకంపం...భయాందోళనల్లో జనం

ABN , First Publish Date - 2022-09-24T13:20:42+05:30 IST

ఇండోనేషియా(Indonesia) దేశంలో శనివారం భారీ భూకంపం సంభవించింది...

Indonesia: భారీ భూకంపం...భయాందోళనల్లో జనం

జకార్తా(ఇండోనేషియా): ఇండోనేషియా(Indonesia) దేశంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియా ఉత్తరప్రాంతంలోని అచేహ్ ప్రాంతంలో 49 కిలోమీటర్ల లోతులో భూకంపం(Strong earthquake) సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. ఈ భూకంపంతో ఇళ్లలోని ప్రజలంతా రోడ్లు, మైదానాల్లోకి తరలివచ్చారు. ఈ భూకంపం(earthquake) వల్ల ఎలాంటి సునామీ(tsunami) హెచ్చరికలు జారీ చేయలేదు. 2004వ సంవత్సరంలో సంభవించిన భూకంపం, భారీ సునామీ వల్ల 2,30,000మంది మరణించారు.అచేహ్ కోస్తా నగరంలో సంభవించిన భూకంపం తీవ్రత 6.4 అని ఇండోనేషియా మెట్రోలాజీ, క్రైమాటాలజీ అండ్ జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.


ఇండోనేషియా దేశంలో తరచూ భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పేలుళ్లు జరుగుతున్నాయి.ఈ ఏడాది ఫిబ్రవరిలో సంభవించిన భూకంపం వల్ల 25 మంది మరణించగా, మరో 460 మంది గాయపడ్డారు. గత ఏడాది సులావేసి ప్రావిన్సులో జనవరి నెలలో సంభవించిన భూకంపం వల్ల 100మంది మరణించగా, మరో 6,500 మంది గాయపడ్డారు. 


Updated Date - 2022-09-24T13:20:42+05:30 IST