జోరుగా గుట్కా అక్రమ రవాణా

ABN , First Publish Date - 2022-09-25T03:50:01+05:30 IST

దర్శి ప్రాంతంలో గుట్కా అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. కొంతమంది అక్రమార్కులు సులభంగా డబ్బు సంపాదించాలనే ల క్ష్యంతో అక్రమ వ్యాపారాన్ని ఎంచుకున్నారు.

జోరుగా గుట్కా అక్రమ రవాణా

కర్నాటక నుంచి దిగుమతి 

శివారు ప్రాంతాల్లో దాచి గ్రామాలకు సరఫరా

దర్శి, సెప్టెంబరు 24 : దర్శి ప్రాంతంలో గుట్కా అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. కొంతమంది అక్రమార్కులు సులభంగా డబ్బు సంపాదించాలనే ల క్ష్యంతో  అక్రమ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. నిషేధి త గుట్కా, ఖైనీ, పాన్‌పరాగ్‌ తదితర ప్యాకెట్లను బెంగ ళూర్‌, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి సరుకు ఇక్క డకు సరఫరా అవుతుంది. ఇక్కడ కొంతమంది వ్యాపా రులు ఆ సరుకును రాత్రిపూట రహస్యంగా గ్రామా లకు చేరవేస్తున్నారు. రిటైల్‌ వ్యాపారులు కొంతమంది ఆ సరుకును విక్రయిస్తు న్నారు. దర్శి పట్టణంలో పలు టీ దుకాణాలు, బడ్డీ బంకుల్లో గుట్టుగా విక్రయాలు సాగిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు పై నుంచి వచ్చిన సరుకును గోడౌన్‌లో రహస్యంగా దాచి అవ స రమైన వారికి విక్రయిస్తున్నారు. బిస్కెట్లు, బ్రెడ్లు తది తర తినుబండారాల వ్యాపారం చాటున గుట్కా, ఖైనీ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు.  పొగాకుతో త యా రు చేసిన ఈ ప్యాకెట్లను తీసుకున్న వ్యక్తులు మత్తుకు బానిసలై నిత్యం కొనుగోలు చేస్తున్నారు. అత్యధిక ధరలకు విక్రయిస్తున్నప్పటికీ పట్టిం చుకోకుండా కొనుగోలు చేస్తుండ డంతో అక్రమార్కులు లా భాలను ఆర్జిస్తున్నారు. పోలీసులు దాడులు చేసిన ప్రతిసారీ భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లు దొరు కుతున్నాయి. గతంలో దర్శిలో పలువురు వ్యా పారులు గుట్కాలు విక్రయిస్తూ ప ట్టుకున్నారు.  అదేవిధంగా తాళ్లూరు మండలం గంగవరంలో భారీ మొ త్తంలో గుట్కా ప్యాకెట్లు పట్టుకు న్నారు. ముండ్లమూరు   మండ లంలో కూడా ఈ వ్యాపారం గు ట్టుగా సాగు తోంది. ఇటీవల కాలం లో అధికారులు  అక్రమ వ్యాపా రం వైపు దృష్టి సారిం చిన దాఖలాలు లేకపోవటంతో గుట్కా వ్యాపారం జో రుగా సాగుతోంది. గుట్కా విక్రయాలపై దాడులు చేసి యువతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2022-09-25T03:50:01+05:30 IST