రాష్ట్రంలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత

ABN , First Publish Date - 2022-06-29T05:36:51+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత
మాట్లాడుతున్న సత్యకుమార్‌

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

  గుంతకల్లు టౌన, జూన 28: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ పేర్కొన్నారు. పట్టణంలోని నామాలసేట్‌ కల్యాణ మండపంలో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 90  శాతం వరకు నిధులు వస్తున్నాయన్నారు. ఈ మూడేళ్ల వైసీపీ పాలనలో ప్రజల వ్యతిరేకత పెరిగిపోయి ప్రతి చోట అధికార పార్టీ నాయకులను నిలదీస్తున్నారన్నారు. నాడు, నేడు పనులపై  ఇంగ్లీష్‌ పేపర్‌లో ప్రకటనలో ఇచ్చారన్నారు. పాఠశాలలకు మరమ్మత్తులు, రంగులు వేశామని, అదనపు తరగతులు నిర్మించామని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కల్తీసారా, నాటుసారా వల్ల ప్రతి రోజు ప్రాణాలు పోతున్నాయన్నారు. నాటుసారా ప్రభావాన్ని ఆపడానికై ప్రభుత్వం వింతపోకడలకు పోయి రాష్ట్రంలో బెల్లం అందబాటులోకి రాకుండా చేశారన్నారు. ధర్మవరంలో ఏడుగురు బీజేపీ నాయకులపై  అధికార పార్టీ నాయకులు విచక్షణా రహితంగా దాడి చేశారన్నారు. దాడులకు భయపడేది లేదన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిమి రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-29T05:36:51+05:30 IST