India-US బంధం నమ్మకానికి ప్రతీక: PM Modi

ABN , First Publish Date - 2022-05-24T20:07:27+05:30 IST

ఇరు దేశాలకు ఎన్నో అంశాల్లో పోలికలు, సామీప్యతలు ఉన్నాయి. అదే ఇరు దేశాల మధ్య బలమైన వారధిని నిర్మించింది. వ్యాపార, పెట్టుబడులకు కూడా ఇరు దేశాల మధ్య బంధం ఇంతకుముందుతో పోలిస్తే మరింత మెరుగ్గానే ఉన్నప్పటికీ అది ఆశించిన..

India-US బంధం నమ్మకానికి ప్రతీక: PM Modi

న్యూఢిల్లీ: భారత్(India) - అమెరికా(America) మధ్య బంధం చాలా దృఢమైనదని, ఈ బంధం నమ్మకమైన భాగస్వామ్యానికి ప్రతీకని ప్రధానమంత్రి(prime minister) నరేంద్రమోదీ(Narendra Modi) అన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా మంగళవారం టోక్యోలో అమెరికా అధినేత జోబైడెన్(Joe Biden)తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య దౌత్య, వ్యాపారపరమైన అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఆలోచనలు, విలువలు ఒకే విధంగా ఉంటాయని, ఇదే ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేశాయని అన్నారు.


‘‘ఇరు దేశాలకు ఎన్నో అంశాల్లో పోలికలు, సామీప్యతలు ఉన్నాయి. అదే ఇరు దేశాల మధ్య బలమైన వారధిని నిర్మించింది. వ్యాపార, పెట్టుబడులకు కూడా ఇరు దేశాల మధ్య బంధం ఇంతకుముందుతో పోలిస్తే మరింత మెరుగ్గానే ఉన్నప్పటికీ అది ఆశించిన స్థాయికి చేరుకోలేదు. యూఎస్​ ఇన్వెస్ట్మెంట్​ ఇన్సెంటివ్​ అగ్రిమెంట్​తో ఇరు దేశాల మధ్య వ్యాపార పరంగా కూడా బంధం బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాను’’ అని మోదీ అన్నారు. కాగా.. భారత్, అమెరికా కలిసి చాలా సాధించాగలవని బైటెన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-05-24T20:07:27+05:30 IST