ప్రదర్శన నిర్వహిస్తున్న ఎస్టీయూ నాయకులు
ఎస్టీయూ నిరసన ప్రదర్శన
గుంటూరు(విద్య), మార్చి27: ప్రభుత్వం ఎటువంటి షరతులు విధించకుండా సీపీఎన్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందేనని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు డి.పెదబాబు డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని శంకర్ విలాస్సెంటర్ నుంచి లాడ్జిసెంటర్ వరకు సీపీఎస్ రద్దుకోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల మంది సీపీఎస్ రద్దు కోసం వేచిచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో జగన్‌మ్మోహనరెడ్డి ఇచ్చిన హామీని తుంగులో తొక్కారని ధ్వజమెత్తారు. ఎస్టీయూ ఏపీ అసోసియేట్ అధ్యక్షులు ఎస్.రామచంద్రయ్య మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలుచేసే వరకు పోరాటాలు విరమించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యు.చంద్రజిత్‌యాదవ్, జిల్లా ఆర్థిక కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు, గౌరవ అద్యక్షులు బి.సంపత్‌బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంవీజేజే కెనడీ, వై.శ్యామ్‌బాబు, కె.అనిల్‌కుమార్, కమతం శ్రీనివాసరావు, రాఘవ, కె.పురుషోత్తం, శ్రీనివాసరావు, రహమాన్, అప్పల నారాయణ, అనంతరామయ్య, రత్యానాయక్, నాగరాజు, కిషోర్, ఎస్కే బాజీ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.