TS News: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2022-09-24T17:21:56+05:30 IST

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

TS News: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (hyderabad central university)లో విద్యార్థులు(Students) ఆందోళనకు దిగారు. కామన్ ఎంట్రన్స్ టేస్ట్ క్వాలిఫై అయిన విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు ధర్నా చేపట్టారు. ధర్నాకు దిగిన విద్యార్థులను యూనివర్సిటీ సేక్యురిటీ సిబ్బంది బలవంతంగా ఖాళీ చేయించారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది తోపులాటలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. 1,57,000 మంది విద్యార్థులు నుంచి రూ.600 అధికంగా వసులు చేశారని యునివర్సిటీ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. 


Updated Date - 2022-09-24T17:21:56+05:30 IST