గర్భవతిని చేసి వివాహానికి నిరాకరణ

ABN , First Publish Date - 2020-09-23T16:32:17+05:30 IST

వివాహం చేసుకుంటానని విద్యార్థినిని నమ్మించి ఆమెను గర్భిణిని చేశాడో ప్రబుద్ధుడు. దీంతో సదరు విద్యార్థిని తన తల్లిదండ్రులతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గర్భవతిని చేసి వివాహానికి నిరాకరణ

చెన్నై : వివాహం చేసుకుంటానని విద్యార్థినిని నమ్మించి ఆమెను గర్భిణిని చేశాడో ప్రబుద్ధుడు. దీంతో సదరు విద్యార్థిని తన తల్లిదండ్రులతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. తాను తల్లిదండ్రులతో కలసి ఉంటూ తూత్తుకుడిలోని ఓ కళాశాలలో బీఎస్సీ చదువుతున్నానని, తమ ఎదురింట్లో ఉంటున్న బంధువుల కుమారుడు వినీత్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని పేర్కొంది. వివాహం చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశారని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయమై తూత్తుకుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటికి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించింది. ఈ క్రమంలోనే తూత్తుకుడి ప్రభుత్వాస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చానని, ప్రస్తుతం వినీత్‌, అతని తల్లిదండ్రుల నుంచి తనకు, తన తల్లిదండ్రులకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది. ఈ వ్యవహారంలో డీఎన్‌ఏ పరీక్ష జరిపి వినీత్‌ను అరెస్టు చేయాలంటూ సదరు విద్యార్థిని ఎస్పీకి  ఫిర్యాదు చేసింది.

Updated Date - 2020-09-23T16:32:17+05:30 IST