ప్రేమ విఫలమై విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-25T06:00:17+05:30 IST

ప్రేమ విఫలమైందని మనస్థాంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చెసుకున్న సంఘట న శుక్రవారం ఖమ్మం నగరంలో జరిగింది.

ప్రేమ విఫలమై విద్యార్థి ఆత్మహత్య

ఖమ్మం క్రైం, జూన్‌24: ప్రేమ విఫలమైందని మనస్థాంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చెసుకున్న సంఘట న శుక్రవారం ఖమ్మం నగరంలో జరిగింది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చింతకాని మం డలం లచ్చగూడేనికి చెందిన సుంగా నాగరాజు(20) అనే విద్యార్థి నగరంలో అద్దెకుంటూ ఓ కళాశాలలో డిగ్రి ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఈనేపఽఽథ్యం లో అతడికి ఓ యువతి పరిచయం అయ్యి అది ప్రేమ గా మారింది. ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు మరో వ్యక్తితో వివాహం చేయడంతో మనస్థాపానికి గురై స్నేహితుని రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-06-25T06:00:17+05:30 IST