NEET: అమ్మా.. నన్ను క్షమించు.. ఆ ఎగ్జామ్ చాలా కష్టం.. సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య!

ABN , First Publish Date - 2022-07-08T22:11:01+05:30 IST

నేటి చదువులు, పోటీ పరీక్షలు కొందరు విద్యార్థుల్లో తీవ్ర నిస్పృహ కలిగిస్తున్నాయి.

NEET: అమ్మా.. నన్ను క్షమించు.. ఆ ఎగ్జామ్ చాలా కష్టం.. సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య!

నేటి చదువులు, పోటీ పరీక్షలు కొందరు విద్యార్థుల్లో తీవ్ర నిస్పృహ కలిగిస్తున్నాయి. పోటీ తట్టుకోలేక కొందరు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చ లేక తమను తాము బలి చేసుకుంటున్నారు. Tamil Naduకు చెందిన ఓ యువకుడు నీట్ ఎగ్జామ్‌లో మంచి మార్కులు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నీట్‌ క్లియర్ చేయలేకపోయినందుకు తల్లిదండ్రులకు క్షమాపణలు చేబుతూ ఓ లేఖ రాశాడు.


ఇది కూడా చదవండి..

Caterpillar: గొంగళి పురుగులతో స్నాక్స్.. వినూత్న ఆలోచనతో ఆకట్టుకుంటున్న దక్షిణాఫ్రికా కంపెనీ!


తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా అరసనట్టి గ్రామానికి చెందిన 18 ఏళ్ల మురళీకృష్ణ అనే యువకుడు ఏడాదిగా National Eligibility-cum-Entrance Test కోసం సిద్ధమవుతున్నాడు. అయినా ఇటీవల జరిగిన పరీక్షలో ఆశించిన మార్కులు సాధించలేకపోయాడు. దీంతో మానసికంగా కుంగిపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురై షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మురళీ ఎంతసేపటికీ తన బెడ్రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు పగలగొట్టారు. లోపల మురళీ విగత జీవిగా కనిపించాడు.


వెంటనే మురళీని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు మురళీ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ కాలేజీలో చేరడానికి అవసరమైన స్కోర్ సాధించలేకపోయానని, తనను క్షమించమని సూసైడ్ నోట్‌లో మురళీ రాసినట్టు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2022-07-08T22:11:01+05:30 IST