అనుమానాస్పదస్థితిలో విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-07-03T05:07:29+05:30 IST

ఓ విద్యార్థి అను మానాస్పదస్థితిలో మృతిచెం దాడు. ఈ సం ఘటన శనివారం మదనపల్లెలో ఆలస్యంగా వెలుగు చూసింది.

అనుమానాస్పదస్థితిలో విద్యార్థి మృతి
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

 హత్యా లేక ఆత్మహత్యా..? టూటౌన్‌ పోలీసుల కేసు దర్యాప్తు

 కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న మృతదేహం

మదనపల్లె క్రైం, జూలై 2: ఓ విద్యార్థి అను మానాస్పదస్థితిలో మృతిచెం దాడు. ఈ సం ఘటన శనివారం మదనపల్లెలో ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణ శివారులోని బీకేప ల్లెకాలనీ సమీపంలోని కంకర ఫ్యాక ్టరీ వద్ద ఓ యువకుడి మృతదేహం పడిఉండ డాన్ని స్థానికులు గుర్తించి టూటౌన్‌ పోలీసు లకు సమాచారం అందించారు. ఈక్రమంలో సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ చంద్రమోహన్‌లు సం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరి శీలించి, ఘటనపై ఆరా తీశారు. కాగా మృతదేహం పక్కనే సెల్‌ఫోన్‌ పడిఉండడంతో అందులోని నంబర్ల ఆధారంగా తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ కుతి కిబం డతాండాకు చెందిన మూడే రెడ్డెప్పనాయక్‌ కుమారుడు ఎం.ఠాగూర్‌ నాయక్‌(21)గా నిర్థారణ చేసి బాధిత కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈనేపథ్యంలో యువ కుడు తమిళనా డు రాష్ట్రం చెన్నైలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నాడు.  మృతదేహం పక్కనే మద్యం బాటిళ్లు పడిఉండడంతోపాటు మృతుడి గొంతుకు తీగలు బిగించి ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే యువకుడిని ఇక్కడికి తీసుకొచ్చి మద్యం తాపించి, మత్తులో గొంతుకు తీగలు బిగించి హత్య చేశారా? లేక ఇతడే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నారు. ఈక్రమంలో తొలుత అనుమానాస్పద మృతికేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. ఠాగూర్‌నాయక్‌ కుటుంబీకులు మద నపల్లెకు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. చెన్నైలో బీటెక్‌ చేస్తున్న అతడు మదనపల్లెకు వచ్చి మృతిచెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదే హం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో ఘటన జరిగి నాలుగైదురోజులై ఉండవచ్చని పోలీసులు అంటున్నారు. ఈ ఘటన బాధిత కుటుంబంలో విషాదం అలుముకుంది. కాగా ఠాగూర్‌ తల్లి శైలజ గోపిదిన్నె మాజీ ఎంపీటీసీ సభ్యురాలు. తండ్రి రెడ్డెప్పనాయక్‌ వ్యవసాయం చేస్తూ రాజకీయంగా తిరుగుతుండేవాడు. వీరికి ఇద్దరు కుమారులుండగా పెద్దకుమారుడు ఠాగూర్‌ మృతిచెందగా, చిన్నకుమారుడు రెడ్డినాయక్‌ ఉన్నాడు. 



Updated Date - 2022-07-03T05:07:29+05:30 IST