సుప్రీంకోర్టులో దళిత విద్యార్థికి ఊరట

ABN , First Publish Date - 2021-11-23T13:31:46+05:30 IST

రుసుం చెల్లించలేని..

సుప్రీంకోర్టులో దళిత విద్యార్థికి ఊరట

బాంబే ఐఐటీకి ప్రవేశ రుసుం చెల్లించలేక పోయిన.. అతడిని చేర్చుకోవాలని తీర్పు


న్యూఢిల్లీ: రుసుం చెల్లించలేని పరిస్థితుల్లో బాంబే ఐఐటీలో సీటును కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్న దళిత విద్యార్థికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన ప్రిన్స్‌ జైబీర్‌ సింగ్‌ ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఆల్‌ ఇండియా 864వ ర్యాంకును సాధించాడు. ఐఐటీ బాంబేలో సివిల్‌ ఇంజనీరింగ్‌ శాఖకు గత నెల 27న ఎంపికయ్యాడు. అయితే రూ.50వేల ప్రవేశరుసుం చెల్లించే సమయంలో క్రెడిట్‌ కార్డు పనిచేయలేదు. మరుసటి రోజు వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో చెల్లింపు సాధ్యపడలేదు. దీనిపై ఐఐటీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈనేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ చేసిన విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తీర్పు ఇచ్చిన 48గంటల్లోగా జైబీర్‌కు సీటు ఇవ్వాలంటూ ఐఐటీ బోంబేను సోమవారం ఆదేశించింది. 

Updated Date - 2021-11-23T13:31:46+05:30 IST