కారు డ్రైవర్‌ను పెళ్లి చేసుకున్న యజమాని కూతురు.. వివాహం తర్వాత బయటపడిన షాకింగ్ విషయం.. చివర్లో ట్విస్ట్ ఏంటంటే..

Published: Mon, 21 Feb 2022 12:24:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కారు డ్రైవర్‌ను పెళ్లి చేసుకున్న యజమాని కూతురు.. వివాహం తర్వాత బయటపడిన షాకింగ్ విషయం.. చివర్లో ట్విస్ట్ ఏంటంటే..

అతను ఒక కుటుంబం వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.. యజమాని కూతుర్ని ప్రతిరోజూ కాలేజీకి తీసుకెళ్లేవాడు.. కారు లేదంటే బైక్ మీద డ్రాప్ చేసేవాడు.. ఈ క్రమంలో వారిద్దరూ స్నేహితులుగా మారారు.. ఆ స్నేహం ప్రేమగా మారింది.. దీంతో ఆ యువతి కుటుంబాన్ని కూడా ఎదురించి అతడితో వెళ్లిపోయింది.. ఇద్దరూ గుళ్లో పెళ్లి చేసుకున్నారు.. అయితే అతడికి అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. అసలు ట్విస్ట్ ఏంటేంటే.. అతడికి రెండో భార్యగా ఉండేందుకు ఆ యువతి మనస్ఫూర్తిగా సిద్ధమైంది. 


కర్ణాటకలోని విజయపుర జిల్లా జాలగేరి గ్రామానికి చెందిన ఓ కుటుంబం వద్ద సోమలింగ అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. యజమాని కూతురు అక్షితను రోజూ కాలేజ్ దగ్గర దింపేవాడు. వీలైతే కారు.. లేకపోతే బైక్ మీద ఆమెను డ్రాప్ చేసేవాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య చనువు పెరిగి ప్రేమలో పడ్డారు. ఇద్దరూ పారిపోయి ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే సోమలింగకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో యువతి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. 


పోలీసులకు, తల్లిదండ్రులకు అక్షిత గట్టి షాక్ ఇచ్చింది. సోమలింగకు పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తనకు ముందే తెలుసని, అన్నీ తెలుసుకున్న తర్వాతే అతడిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. సోమలింగ మొదటి భార్య, పిల్లలతో కలిసి తాను కూడా ఉంటానని స్పష్టంగా చెప్పింది. అక్షిత మేజర్ కావడంతో పోలీసులు చేసేదేం లేక ఊరుకున్నారు. కాగా, తనకు పుట్టింటి వారి నుంచి ప్రమాదం ఉందని అక్షిత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం గమనార్హం. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.