Student: నాలుగు గంటల్లో 195 దేశాల జాతీయ గీతాలు

ABN , First Publish Date - 2022-09-13T17:02:53+05:30 IST

నాలుగు గంటల్లో 195 దేశాల జాతీయ గీతాలు ఆయా దేశ భాషల్లోనే పాడిన విద్యార్థిని రికార్డు సృష్టించింది. స్థానిక తిరువొత్తియూర్‌

Student: నాలుగు గంటల్లో 195 దేశాల జాతీయ గీతాలు

                                                 - విద్యార్థిని సాధన

పెరంబూర్‌(చెన్నై, సెప్టెంబరు 12: నాలుగు గంటల్లో 195 దేశాల జాతీయ గీతాలు ఆయా దేశ భాషల్లోనే పాడిన విద్యార్థిని రికార్డు సృష్టించింది. స్థానిక తిరువొత్తియూర్‌ అన్నామలైనగర్‌(Thiruvottiyur Annamalainagar)కు చెందిన హేమంత్‌, మోహనప్రియ దంపతుల కుమార్తె సుభిక్ష (13) తిరువొత్తియూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆమెకు బాల్యం నుంచే పలు దేశాల భాషలు నేర్చుకోవాలని ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో, ఆదివారం జరిగిన కార్యక్రమంలో సుభిక్ష, ఆఫ్ఘనిస్తాన్‌, అమెరికా, సింగపూర్‌, భారత్‌, రష్యా, ఉక్రెయిన్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, అంగోలా, కెనడా, బంగ్లాదేశ్‌, కువైట్‌, మలేసియా సహా 195 దేశాల గీతాలను ఆ దేశాల భాషల్లోనే పాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. యూట్యూబ్‌ ద్వారా ఆయా దేశాల జాతీయ గీతాలు చూసిన సుభిక్ష, ఆయా దేశాల రాగాలకు అనుగుణంగా గీతాలు ఆలపించినట్లు తల్లిదండ్రులు తెలిపారు.

Updated Date - 2022-09-13T17:02:53+05:30 IST