విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-18T06:02:12+05:30 IST

ఒంగోలు స మీపంలోని పెళ్లూరులో గల ఓ ప్రైవేటు జూ నియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవ త్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విద్యార్థి ఆత్మహత్య


ప్రైవేటు జూనియర్‌ 

 కాలేజీ హాస్టల్‌లో ఘటన

అనుమానం వ్యక్తం చేస్తున్న తండ్రి

ఒంగోలు(క్రైం), ఏప్రిల్‌ 17: ఒంగోలు స మీపంలోని పెళ్లూరులో గల ఓ ప్రైవేటు జూ నియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవ త్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. కళాశాల హాస్టల్‌లోని కిచెన్‌ గదిలో దుంపా పవన్‌ కల్యాణ్‌రెడ్డి (19) మంచం న వారుతో ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం తోటి విద్యార్థులు గుర్తించి వార్డెన్‌కు చెప్ప డంతో హడావుడిగా పవన్‌ను కిందకు దించి రిమ్స్‌కు తరలించారు.  అప్పటికే మృతిచెం దినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పవన్‌ తండ్రి అంజిరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కొనక నమిట్ల మండలం రేగలగడ్డకు చెందిన పవ న్‌కల్యాణ్‌రెడ్డి ఈ ఏడాది పెళ్లారులో గల జూ నియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవ త్సరంలో చేరాడు. ఈ నెలలో సెలవులకు వెళ్లి తిరిగి 5న కాలేజీకి వచ్చాడు. తన వెంట కళా శాలలో చెల్లించాల్సిన ఫీజు రూ.10వేలు తె చ్చాడు. అప్పటి నుంచి కుమారుడితో అంజి రెడ్డి మాట్లాడలేదు. శనివారం ఉదయం కాలే జీ నుంచి ఫోన్‌ చేసి మీ కుమారుడికి సీరి యస్‌గా ఉందని, రిమ్స్‌లో ఉన్నాడని చెప్పా రని ఆయన తెలిపారు. దీంతో అంజిరెడ్డి కు టుంబసభ్యులు రిమ్స్‌కు రాగా అక్కడ పవన్‌ కల్యాణ్‌రెడ్డి మృతదేహం చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కుమారుడికి గతంలో తక్కువ మార్కులు వచ్చాయని, అం తేగాకుండా పరీక్షల్లో స్లిప్పులు రాస్తుంటే అక్క డ ఉన్న ఉపాధ్యాయులు హెచ్చరించినట్లు తెలిసిందని అంజిరెడ్డి చెప్పారు. అయితే తన కుమారుడి మృతికి గల అసలు కారణం తెలియాల్సి ఉందని వాపోయారు. ఈ మేరకు ఒంగోలు తాలుకా పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ సోమ శేఖర్‌, సిబ్బంది పరిశీలించారు.


Updated Date - 2021-04-18T06:02:12+05:30 IST