
హైదరాబాద్: నగరంలోని మియాపూర్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్లోని ఎం.ఎ నగర్లో నివాసం ఉండే సంజీవులు కుమార్తె సాయి లలిత మెడిసిన్లో సీటు కోసం నీట్ పరీక్ష రాసింది. అయితే నీట్ ఎగ్జామ్లో సాయి లలిత క్వాలిఫై కాలేదు. దీంతో మనస్తాపం చెంది గత రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడింది. చికిత్స కోసం ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆమె మరణించినట్లు పోలీసులు తెలిపారు.