
నిజామాబాద్: నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీ భవనం పైనుంచి దూకి ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బైక్ యాక్సిడెంట్ విషయంలో గొడవ జరిగిందని, అందుకే ఆతను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినిని జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన సాయి కుమార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.