Teacher: మీరు నిరుత్సాహపరిచినా నేను పాస్ అయ్యా అంటూ టీచర్‌కు స్టూడెంట్ మెసేజ్.. అవతలి నుంచి రిప్లై ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-27T02:27:12+05:30 IST

మాటలకు చాలా శక్తి ఉంది.. అవి మనుషుల జీవితాలను మలుపు తిప్పగలవు.. ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తూ మాట్లాడే మాటలు అతడిలో ఎనలేని స్ఫూర్తిని నింపుతాయి.

Teacher: మీరు నిరుత్సాహపరిచినా నేను పాస్ అయ్యా అంటూ టీచర్‌కు స్టూడెంట్ మెసేజ్.. అవతలి నుంచి రిప్లై ఏంటంటే..

మాటలకు చాలా శక్తి ఉంది.. అవి మనుషుల జీవితాలను మలుపు తిప్పగలవు.. ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తూ మాట్లాడే మాటలు అతడిలో ఎనలేని స్ఫూర్తిని నింపుతాయి.. నిరుత్సాహపరుస్తూ మాట్లాడే మాటలు అతడిని పరాజితుడిగా నిలుపుతాయి.. అయితే కొందరు నిరాశపూరిత వాతావరణంలో ఉన్నా తమలో తామే స్ఫూర్తిని నింపుకుంటూ విజయాలు సాధిస్తారు.. తాజాగా ఓ విద్యార్థి చేసిన ట్వీట్ ఆ విషయాన్నే రుజువు చేస్తోంది.. ఇంటర్ పాస్ కాలేవని టీచర్ చెప్పిన మాటలను ఆ విద్యార్థి ఛాలెంజ్‌గా తీసుకున్నాడు.. కష్టపడి చదివి పాస్ అయ్యాడు.. ఆ తర్వాత తన విజయం గురించి టీచర్‌కు మెసేజ్ చేశాడు.. ఆ స్టూడెంట్, టీచర్ మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇది కూడా చదవండి..

Bihar: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ముగ్గురు పిల్లల తల్లి.. గ్రామస్తులు ఏం చేశారంటే..


@famouspringroll ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ అయిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌ ప్రకారం.. ఆ విద్యార్థి 12వ తరగతి పాస్ కాలేడని అతని టీచర్ అంచనా వేసింది. అయితే ఆమె అంచనాకు భిన్నంగా అతను పరీక్షలో పాస్ అయ్యాడు. ఆ విషయాన్ని టీచర్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేస్తూ.. `ఇతరుల పట్ల దయతో ఉండాలని గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీ సహాయం కోసం విద్యార్థులు వచ్చినపుడు` అని పేర్కొంటూ ఓ లేఖ రాశారు. `హాయ్ మేడమ్.. నేను 2020 పదో తరగతి బ్యాచ్ విద్యార్థిని. నేను 12వ తరగతి పాస్ కాలేనని చెప్పారు. మీకు వీలైనప్పుడల్లా నన్ను నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. కానీ, నేను ఇప్పుడు పాస్ అయ్యాను. నాకు నచ్చిన యూనివర్సిటీలో, నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యాను. ఇది థాంక్యూ మెసేజ్ కాదు.. నేను సాధించానని మీకు చెప్పాలనుకుంటున్నాను. 


దయచేసి, ఇకపై ఇతరుల పట్ల దయతో ఉండాలని గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీ సహాయం కోసం విద్యార్థులు వచ్చినపుడు` అని మెసేజ్ చేశాడు. దానికి ఆ టీచర్ రిప్లై ఇచ్చారు. `నువ్వు పాస్ కావడంలో నా భాగస్వామ్యం కూడా ఉందని ఇప్పటికీ అనుకుంటున్నాన`ని రిప్లై ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థి షాకయ్యాడు. తమ సంభాషణ తాలూకు స్క్రీన్ షాట్‌లను ట్విటర్‌లో షేర్ చేశాడు. 

Updated Date - 2022-07-27T02:27:12+05:30 IST