పాలిటెక్నిక్‌ ఫలితాల్లో ‘మదర్‌థెరీసా’ విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-05-11T04:45:57+05:30 IST

పాలిటెక్నిక్‌ మూడు, అయిదవ సెమిస్టర్‌లలో సత్తుపల్లి మదర్‌ థెరీసా ఇనిస్టిస్ట్యూట్‌ ఆ్‌ఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (మిస్ట్‌) కళాశాల విద్యార్థులు ప్రతిభను చాటారు.

పాలిటెక్నిక్‌ ఫలితాల్లో ‘మదర్‌థెరీసా’ విద్యార్థుల ప్రతిభ

సత్తుపల్లి, మే 10: పాలిటెక్నిక్‌ మూడు, అయిదవ సెమిస్టర్‌లలో సత్తుపల్లి మదర్‌ థెరీసా ఇనిస్టిస్ట్యూట్‌ ఆ్‌ఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (మిస్ట్‌) కళాశాల విద్యార్థులు ప్రతిభను చాటారు. ఫలితాల్లో కొందరు విద్యార్థులు 10/10 గ్రేడ్‌ పాయింట్లు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీ.హరికృష్ణ సోమవారం తెలిపారు. డిప్లొమో అయిదవ సెమిస్టర్‌లో మెకానికల్‌ విభాగంలో జంగా వాణి, కొప్పిశెట్టి తిరుమల వెంకటసాయి, సయ్యద్‌ దిల్‌షాద్‌లు  10/10 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. గుంజే సతీష్‌ 9.33, మచ్చా కుమార్‌ రాజా 9.86 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. ఈఈఈ విభాగంలో నాగిశెట్టి శ్రావణి 10/10, మద్దిరాల సాయిరామ్‌, నల్లని సందీప్‌ కుమార్‌, పాటిబండ్ల రిత్విక్‌లు  9.33,  లావుడ్యా శ్రీకాంత్‌ 9.20, ఉబ్బన అఖిల 9.20 సాధించారు. మైనింగ్‌లో కంటే దిలీప్‌ 9.73, దామరకొండ అజయ్‌, మొరంపుల సంతో్‌షలు 9.46, క్రొవ్విది సాత్విక్‌ కుమార్‌ 9.33 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు.  3వ సెమిస్టర్‌ ఫలితాల్లో సివిల్‌ విభాగంలో పాటిబండ్ల వైష్ణవి 10/10, మాటా చందు 9.42, చల్లాఽ ధనుష్‌ 8.93 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. మైనింగ్‌లో ధర్మరాజుల వినయ్‌కుమార్‌ 9.87, శ్రీపతి వెంకట్‌, కోడి సంపత్‌లు 9.73, ఎమ్మా శ్రీకాంత్‌ 9.47 సాధించారు. ఈసీఈలో వేమిరెడ్డి భార్గవి 9.87, వంగల గోపినితిన్‌రెడ్డి, ముందల దీపక్‌శ్రీలు  9.47 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. ఈఈఈ విభాగంలో కుంజా కీర్తి ప్రియ, గొడుగు వంశీలు 9.87, కారం ప్రణయ్‌ తేజా, వంగల గోపిచంద్‌రెడ్డి, తమ్ము రోహిత్‌లు 9.73, పమ్మి ప్రశాంత్‌ చారి 9.47 సాధించారు. మెకానికల్‌ విభాగంలో పసునుటి సాయిఅభినయ్‌ 9.73, గడిపర్తి కిరణ్‌కుమార్‌ 9.67, నరిశెట్టి గణేష్‌, కేశా సాయిలు 9.60 సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల చైర్మన్‌ కంచర్ల సత్యనారాయణ, సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ చలసాని సాంబశివరావు, డైరెక్టర్‌ డాక్టర్‌ కందిమళ్ల కృష్ణారావు అభినందించారు. 


Updated Date - 2021-05-11T04:45:57+05:30 IST