శృతిమించుతున్న విద్యార్థుల ఆగడాలు

ABN , First Publish Date - 2022-03-19T14:55:42+05:30 IST

తేని జిల్లా దేవారం, దేవదానపట్టి, జి.కల్లుపట్టి ప్రభుత్వ మహోన్నత పాఠశాలల్లో విద్యార్థుల ఆగడాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. దీంతో, తమకు రక్షణ

శృతిమించుతున్న విద్యార్థుల ఆగడాలు

                      - రక్షణ కల్పించాలని ఉపాధ్యాయుల ఆందోళన


పెరంబూర్‌(చెన్నై): తేని జిల్లా దేవారం, దేవదానపట్టి, జి.కల్లుపట్టి ప్రభుత్వ మహోన్నత పాఠశాలల్లో విద్యార్థుల ఆగడాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. దీంతో, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఉపాధ్యాయులు గురువారం జిల్లా విద్యాధికారి కార్యాలయ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. ఈ విషయమై ఉపాధ్యాయులు మాట్లాడుతూ, వేదారం పాఠశాలలో పుస్తకాలు తీసుకురావాలని మందలించిన ఉపాధ్యాయుడిపై సదరు విద్యార్థి దాడిచేశాడని పేర్కొన్నారు. జి.కల్లుపట్టిలో విద్యార్థులు ఉపాధ్యాయులను హేళన చేయడం నిత్యకృత్యంగా మారిందన్నారు. అలాగే, దేవానంపట్టి పాఠశాలకు కత్తితో వచ్చిన విద్యార్థి ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించారని, ఈ విషయమై డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో విద్యార్థిని మందిలించారని, ఈ నేపథ్యంలో, మరుసటి రోజు ఆ విద్యార్థి మళ్లీ కత్తితో వచ్చి ఉపాధ్యా యుడిని బెదిరించాడని తెలిపారు. దీంతో, విద్యార్థుల నుండి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా విద్యార్థులకు వినతిపత్రం సమర్పించినట్లు ఉపాధ్యా యులు పేర్కొన్నారు.

Updated Date - 2022-03-19T14:55:42+05:30 IST