Bengaluru: రోడ్డెక్కిన విద్యార్థులు

ABN , First Publish Date - 2021-11-18T17:32:15+05:30 IST

ద్వితీయ పీయూసీ విద్యార్థులకు ఈ నెలాఖరున పీయూ బోర్డు నిర్వహించతలపెట్టిన మధ్యవార్షిక పరీక్షలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మధ్యవార్షిక పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం

Bengaluru: రోడ్డెక్కిన విద్యార్థులు

                      - మధ్యవార్షిక పరీక్షలపై నిరసన

                      - పీయూ బోర్డు నిర్ణయంపై ఆగ్రహం


బెంగళూరు: ద్వితీయ పీయూసీ విద్యార్థులకు ఈ నెలాఖరున పీయూ బోర్డు నిర్వహించతలపెట్టిన మధ్యవార్షిక పరీక్షలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మధ్యవార్షిక పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయంపై బుధవారం విద్యార్థి సంఘాల పిలుపునకు పెద్దఎత్తున విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. మధ్యవార్షిక పరీక్షల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఇదే సందర్భంగా ఏఐడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షురాలు అశ్విని మాట్లాడుతూ పీయూ బోర్డు విద్యార్థులతో చెలగాటం సరికాదన్నారు. ముందస్తు సమాచారం లేకుండా పరీక్షల షెడ్యూలు ఎలా ప్రకటిస్తారన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులతో పాటు అన్నివర్గాలకు పరీక్షల ఏర్పాటు సముచితంగా లేదన్నారు. ఓ వైపు కళాశాలలు ప్రారంభమై మూడునెలలు కాలేదని మరో వైపు ఇంకా అడ్మిషన్‌లు జరుగుతూనే ఉన్నాయన్నారు. కనీసంగా 40 శాతం కూడా పాఠ్యాంశాలు పూర్తీకాకుండానే మధ్యవార్షిక పరీక్షలు ఎందుకన్నారు. సాధారణంగా మధ్యవార్షిక పరీక్షలు జరుగుతాయని కానీ ఏకంగా పీయూ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అమలు చేస్తామనే ప్రకటన సరికాదన్నారు. విద్యార్థులు, అధ్యాపకులకు మానసిక ఒత్తిడి కలిగించేలా అధికారులు ప్రవర్తిస్తున్నారన్నారు. వెంటనే పరీక్షలు రద్దు చేయాలన్నారు. ఇంకా కొవిడ్‌ పూర్తిగా నిలిచిపోలేదనేది మరువరాదన్నారు. పీయూ బోర్డు మధ్యవార్షిక పరీక్షలు రద్దు చేయని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బెంగళూరు నగర విద్యార్థి సంఘాల ముఖ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-18T17:32:15+05:30 IST