డిగ్రీ కళాశాల స్థల ఆక్రమణపై విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-27T06:20:49+05:30 IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని అక్రమించారంటూ విద్యార్థులు, పూర్వవిద్యార్థులు మంగళవారం కళాశాల వద్ద ఆందోళన చేశారు.

డిగ్రీ కళాశాల స్థల ఆక్రమణపై విద్యార్థుల ఆందోళన
కళాశాల గేటు వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు

తిరువూరు, అక్టోబరు 26: ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని అక్రమించారంటూ విద్యార్థులు, పూర్వవిద్యార్థులు మంగళవారం కళాశాల వద్ద ఆందోళన చేశారు. కళాశాల  ప్రధాన గేటుకు ఒక వైపు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి పెన్సింగ్‌  వేశారని ఆరోపించారు. తమ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలని విద్యార్థులు కోరారు. ఈ సమస్యపై కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు సమావేశం నిర్వహించి, చర్చించారు. మాజీ మంత్రి కోనేరు రంగారావు నివేశన స్థలం నిమిత్తం తనకు పట్టా ఇచ్చారని ప్రస్తుతం అక్రమించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తన వద్ద ఉన్న పట్టా చూపుతున్నాడు. దీనిపై స్పందించిన తహసీల్దార్‌ స్వర్గం నరసింహారావు కళాశాల వద్ద వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆక్రమణ తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హెచ్చరించారు.


డిగ్రీ కళాశాలలో డిజిటల్‌ క్లాసులు..

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం సహాయంతో డిజిటల్‌ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుశీలరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు డిజిటల్‌ తరగతి గదులు, 50 కంప్యూటర్లతో రెండు ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పీహెచ్‌డీఅధ్యాపకులతో నాణ్యమైన విద్యాభోదన అందించటం జరుగుతుందని సుశీలరావు తెలిపారు. 


Updated Date - 2021-10-27T06:20:49+05:30 IST