ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-04T18:20:01+05:30 IST

కొవిడ్‌ కేసులు పెరిగిపోతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. సెకెండ్‌ వేవ్‌తో బళ్లారి, విజయనగర జిల్లాల్లో కొవిడ్‌ కేసులు జీరో స్థాయికి పడిపోవడంతో ఇన్ని రోజులు ఊపిరి పీల్చుకున్న జిల్లా వైద్య ఆరోగ్య

ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్‌

- హగరిబొమ్మనహళ్లి పాఠశాల బంద్‌ 

- బళ్లారి, విజయనగర జిల్లాల్లో కొవిడ్‌ విస్తరణ 

- ఒకే రోజు 11 పాజిటివ్ కేసులు


బళ్లారి(కర్ణాటక): కొవిడ్‌ కేసులు పెరిగిపోతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. సెకెండ్‌ వేవ్‌తో బళ్లారి, విజయనగర జిల్లాల్లో కొవిడ్‌ కేసులు జీరో స్థాయికి పడిపోవడంతో ఇన్ని రోజులు ఊపిరి పీల్చుకున్న జిల్లా వైద్య ఆరోగ్య వైద్యశాఖ అధికారులు పెరుగుతున్న కొవిడ్‌ కేసులతో అప్రమత్తమవుతున్నారు. గతవారం వరకు ఉభయ జిల్లాల్లో శూన్య స్థితిలో కొవిడ్‌ కేసుల సంఖ్య గత మూడు రోజులుగా వాటి సంఖ్య పెరుగుతూ వస్తుండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కొవిడ్‌ సెకెండ్‌ డోస్‌తో కొవిడ్‌ను అడ్డుకట్టు వేసినట్లయిందని ఊపిరి పీల్చుకున్న అధికారుల్లో మళ్లీ కొత్తగా కేసులు వెలుగు చూస్తుండడంతో వైద్యాధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగర జిల్లా పరిధిలోని హగరిబొమ్మనహళ్లి పట్టణంలోని పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు కొవిడ్‌ బారిన పడడంతో సోమవారం నుంచి పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం బళ్లారి తాలూకాలో ముగ్గురు కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో తాలూకాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 55కి చేరింది. బళ్లారి జిల్లా పరిధిలో కంప్లిలో ఒకటి, సండూరులో 21, సిరుగుప్పలో 7 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉండగా, వీరంతా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అధికారుల గణాకాల ప్రకారం ఒక్క బళ్ళారి జిల్లాలోనే 84 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. ఇక విజయనగర జిల్లా పరిధిలో పరిశీలిస్తే జిల్లాకేంద్రమైన హొసపేట పట్టణంలో  సోమవారం 3, హగరిబొమ్మనహళ్లిలో 3 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో హొసపేటలో 8, కూడ్లిగిలో 5, హగరిబొమ్మనహళ్ళిలో 11, హరపనహళ్ళిలో 8, హడగిలో 10 కోవిడ్‌ యాక్టివ్‌ కేసులతో మొత్తం విజయనగ జిల్లాలో ఇప్పటి వరకు 42 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు  అధికారులు ప్రకటించారు. 

Updated Date - 2022-01-04T18:20:01+05:30 IST