విద్యార్థుల భవిష్యతపై భరోసా కల్పించాలి

Jun 17 2021 @ 00:29AM
సమావేశంలో మాట్లాడుతున్న జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  జాజుల శ్రీనివాస్‌గౌడ్‌
మర్రిగూడ, జూన 16:
  ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల భవిష్యతకు భరోసా కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన మండలం కేంద్రంలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడారు. ఈ నెల 21న పాఠశాలలు పునః ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆనలైన బోధన అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నందున వారికి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఉచితంగా అందించాలని కోరారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆనలైన ద్వారా విద్యా బోధనలు చేస్తుండగా  ప్రభుత్వం యాదగిరి టీవీ ఛానల్‌తో విద్యా బోధన అందించడంతో విద్యార్థులు ఈ బోధనలకు నోచుకోలేక పోతున్నారన్నారు. ప్రతి మండలంలో జిల్లా పరిషత పాఠశాలను గురుకులాలుగా ఏర్పాటుచేసి బడుగు, బలహీన నిరుపేద విద్యార్థులకు విద్యా బోధనలు అందేలా వారి భవిష్యతకు పునాది వేయాలని కోరారు. కరోనా మహమ్మారి ప్రార ంభదశలో ఉన్నందున విద్యార్థులపై ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తుగానే వైద్యపరీక్షలు నిర్వహించాలని కోరారు. సమావేశంలో కుక్కడ ముత్యా లు, వైస్‌ ఎంపీపీ కటుకూరి వెంకటే్‌షగౌడ్‌, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన యాదయ్యగౌడ్‌,సర్పంచ నల్లా యాదయ్యగౌడ్‌, నర్సింహ, కొండల్‌ పాల్గొన్నారు.

Follow Us on: