విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

ABN , First Publish Date - 2022-07-07T04:57:06+05:30 IST

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు వస్తుందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
టెట్‌లో అర్హతను సాధించిన అభ్యర్థులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు 

దుబ్బాక, జూలై 6: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు వస్తుందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. బుధవారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇటీవల రఘన్న సేవాదళ్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిర్వహించిన టెట్‌ కోచింగ్‌లో అర్హత సాధించిన 118 మంది అఽభ్యర్థులను శాలువాతో సన్మానించి మాట్లాడారు. దుబ్బాకలో ఎస్‌వీ బీఈడీ కళాశాలలో 45 రోజులపాటు 180 మందికి శిక్షణ ఇచ్చామని, అందులో 118 మంది అభ్యర్థులు డీఏస్సీకి అర్హతను సాధించినట్టు తెలిపారు. టెట్‌లో అర్హతను సాధించిన అభ్యర్థుల కోసం డీఎస్సీ కోచింగ్‌ను కూడా ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ మల్లారెడ్డి, బీజేపీ నాయకులు బాలే్‌షగౌడ్‌, సుభా్‌షరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, ఎస్‌ఎన్‌ చారి, వెంకటస్వామి, స్వామి పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T04:57:06+05:30 IST