ఆ టీచర్‌ అంటే విద్యార్థులకు ఎంత ప్రేమంటే.. ఆమె వెళ్లిపోతోందని తెలిసి కన్నీళ్లు.. మోకాలిపై కూర్చుని వీడ్కోలు!

ABN , First Publish Date - 2022-02-20T17:39:22+05:30 IST

ఒక వ్యక్తి జీవితంలో తల్లి, తండ్రి తర్వాత గురువుదే కీలక పాత్ర. విద్య నేర్పి, వెన్ను తట్టి ప్రోత్సహించిన గురువులను ఎవరూ మర్చిపోలేరు.

ఆ టీచర్‌ అంటే విద్యార్థులకు ఎంత ప్రేమంటే.. ఆమె వెళ్లిపోతోందని తెలిసి కన్నీళ్లు.. మోకాలిపై కూర్చుని వీడ్కోలు!

ఒక వ్యక్తి జీవితంలో తల్లి, తండ్రి తర్వాత గురువుదే కీలక పాత్ర. విద్య నేర్పి, వెన్ను తట్టి ప్రోత్సహించిన గురువులను ఎవరూ మర్చిపోలేరు. అలాంటి గురువు దూరమవుతుంటే ఎంతో ఆవేదన చెందుతారు. అలాంటి ఘటన తాజాగా పశ్చిమబెంగాల్‌లో జరిగింది. సాధారణ బదిలీ మీద వేరే పాఠశాలకు వెళ్లిపోతున్న గురువుకు విద్యార్థినులు అత్యంత ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఆమెతో పాటు వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


పశ్చిమ బెంగాల్‌లోని కటియాహట్ బికేఏపీ బాలికల పాఠశాలలో సంపా అనే టీచర్‌ కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. పాఠశాలలోని విద్యార్థులతో ఆమెకు అవినాభావ సంబంధం ఏర్పడింది. సాధారణ బదిలీ మీద ఆమెకు వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్ అయింది. ఆ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆవేదనకు గురయ్యారు. తమకు ఎంతో ఇష్టమైన టీచర్‌కు వినూత్నంగా వీడ్కోలు పలకాలని భావించారు. 


ఆమె కళ్లు మూసి పాఠశాల గ్రౌండ్‌లోకి తీసుకెళ్లారు. విద్యార్థినులందరూ మోకాళ్లపై కూర్చుని గులాబీ పువ్వులు పట్టుకుని `రబ్​నే బనాదీ జోడి` సినిమాలోని పాటను పాడారు. ఆ సందర్భంగా అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి ఆవేదన చూసి ఆ టీచర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత అందరినీ హత్తుకుని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.



Updated Date - 2022-02-20T17:39:22+05:30 IST