సీఎం విధానాలతో అంధకారంలో విద్యార్థులు

ABN , First Publish Date - 2021-04-24T04:39:34+05:30 IST

సీఎం జగన్‌ తప్పుడు విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందని చోడవరం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు విమర్శించారు.

సీఎం విధానాలతో అంధకారంలో విద్యార్థులు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తాతయ్యబాబు

చోడవరం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి తాతయ్యబాబు

బుచ్చెయ్యపేట, ఏప్రిల్‌ 23:
సీఎం జగన్‌ తప్పుడు విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందని చోడవరం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు విమర్శించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రాష్ర్టాలు విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రద్దు, వాయిదా వేశాయని గుర్తు చేశారు. జగన్‌ ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడం 15 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని పేర్కొన్నారు. గత రెండు రోజుల్లో కరోనా ఉధృత పరిస్థితులతో పరీక్షలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు డొంకిన అప్పలనాయుడు, గోకివాడ కోటేశ్వరరావు, తమరాన దాసు, గొన్నాబత్తుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:39:34+05:30 IST