విద్యార్థులు శాస్ర్తీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలి

ABN , First Publish Date - 2021-02-28T06:56:35+05:30 IST

నేటి విద్యార్థులు విద్యాభివృద్ధిలో భాగమైన శాస్ర్తీయ విజ్ఞానం వైపు అడుగులు వేయాలని ఎంఈవో జె.ప్రసాద్‌రావు పేర్కొన్నారు.

విద్యార్థులు శాస్ర్తీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలి
సైన్స్‌ దినోత్సవంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

కనిగిరి, ఫిబ్రవరి 27: నేటి విద్యార్థులు విద్యాభివృద్ధిలో భాగమైన శాస్ర్తీయ విజ్ఞానం వైపు అడుగులు వేయాలని ఎంఈవో జె.ప్రసాద్‌రావు పేర్కొన్నారు. మండలంలోని తుమ్మగంట గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా శనివారం జరిగిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించడం వలన విద్యార్థుల్లో సైన్స్‌పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థినీ, విద్యార్థులు తయారు చేసిన సైన్స్‌ నమూనాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకొని వారిని అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం జి.ప్రభాకర్‌, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

కందుకూరు : స్థానిక జడ్‌పీ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం డి.అనూరాధ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయటంతో పాటు గత సంవత్సరం ఎన్‌ఎంఎంఎ్‌సలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. గణితం, సైన్స్‌లో తరగతుల వారీ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత సైన్స్‌ ఉపాధ్యాయుడు జీవీ.కృష్ణారావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బండి గోవిందయ్య, పెరుగు ప్రసాదు, బిఏ కామేశ్వరి, ఎం. రమణయ్య, ఎం. విప్రనారాయణ, ఐ.శ్రీనిధి, పి.శ్రీనివాసరావు, ఎం.శ్రీదే వి, జి. కొండమ్మ, ఎస్‌కె సందాని బాషా, ఎం.సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T06:56:35+05:30 IST