విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2021-01-22T05:56:00+05:30 IST

విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలి

విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలి
పాఠశాలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌

  • వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ 


వికారాబాద్‌: పాఠశాలలు ప్రారంభమయ్యాక విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ సూచించారు. వికారాబాద్‌ పట్టణ పరిధి ఆలంపల్లిలోని ఉర్దూ మీడియం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  గురువారం పర్యటించి పాఠశాల శుభ్రత, మౌలిక వసతులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను పంపే విషయంలో తల్లిదండ్రులదే తుది నిర్ణయమని అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు రామస్వామి, పావని, కిరణ్‌, అనంత్‌రెడ్డి, ఎంఈవో బాబుసింగ్‌, నాయకులు చిగుళ్లపల్లి రమేష్‌, చంద్రశేఖర్‌రెడ్డి, సురే్‌షగౌడ్‌ పాల్గొన్నారు.

కులకచర్ల/బొంరాస్‌పేట్‌: కలకచర్ల బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రవీందర్‌గౌడ్‌గురువారం పాఠశాలలోని తరగతి గదులను శానిటైజ్‌ చేయించారు. ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతులు నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు వంట తయారి ఏజెన్సీలతో మాట్లాడామని తెలిపారు.  బొంరా్‌సపేట్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు శానిటైజేషన్‌ చేయించాలని మండల విద్యాధికారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కొవిడ్‌-19 నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


Updated Date - 2021-01-22T05:56:00+05:30 IST